2025లో వీరికి మహారాజయోగం.. నా మాటే శాసనం అన్న బాబా వంగా!

2025 సంవత్సరం మరో రెండు రోజుల్లో ఎంట్రీ ఇస్తుంది. 2025లో తమ జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. 2025సంవత్సరంలో గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు మారుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే 2025సంవత్సరంలో ఏ రాశుల వారి పంట పండుతుంది. నక్కతోక తొక్కే రాశులు ఏమిటి? అనేది ప్రపంచంలోని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు అయిన బాబా వంగా తన అంచనాలలో ఎప్పుడో వెల్లడించారు.

2025 అదృష్టరాశులు... బాబా వంగా ప్రిడిక్షన్
1966లో బాబా వంగా మరణించారు. అయినా బాబా వంగా జ్యోతిష్య శాస్త్ర అంచనాలు నేటికి చాలామంది బలంగా నమ్ముతారు. అవి నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. బాబా వంగా తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను గొప్ప అంచనాలు వేసి ముందుగానే చెప్పారు. ఈ క్రమంలో 2025లో ఏ రాశివారు అదృష్టవంతులు కాబోతున్నారో బాబా వంగా జ్యోతిష్య అంచనాల ప్రకారం తెలుసుకుందాం.

These zodiac signs going to wealthy in 2025 Baba Vanga astrological prediction

మేషరాశి
బాబా వంగా జ్యోతిష్య అంచనాల ప్రకారం మేషరాశి వారికి 2025 సంవత్సరం గొప్ప విజయాలను అందించే సంవత్సరం . ఈ ఏడాది మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుందని, డబ్బు సంపాదించడానికి చాలా గొప్ప అవకాశాలు వస్తాయని, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేషరాశి వారి ఆర్ధిక స్థితి బాగానే ఉంటుందని అన్నారు. మేషరాశి జాతకులు ఈ ఏడాది ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. 2025సంవత్సరం వీరికి సంపదను, పురోగతిని ఇస్తుందని బాబా వంగా పేర్కొన్నారు.

వృషభ రాశి
బాబా వంగా 2025లో వృషభ రాశి వారు సంపన్నులు అవుతారని తేల్చారు. 2025లో తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారని, ఆర్థికంగా ఈ సమయాల్లో బలోపేతం అవుతారని బాబా వంగా జ్యోతిష్య అంచనాలో వెల్లడించారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి విజయాలు వరిస్తాయని బాబా వంగా తెలిపారు. బాబా వంగా అంచనా ప్రకారం వృషభ రాశి వారికి ఇది అదృష్ట సంవత్సరం.

కర్కాటక రాశి
బాబా వంగా జ్యోతిష్య అంచనా ప్రకారం 2025 సంవత్సరం కర్కాటక రాశి వారికి శుభాలను చేకూర్చే సంవత్సరం. కర్కాటక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి కూడా అద్భుతమైన సమయం ఇది అని పేర్కొన్నారు. ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయని, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం అన్నారు.. ఆర్థికంగా ఈ సమయంలో బాగుంటుంది అని తెలిపారు.

మిధున రాశి
2025 సంవత్సరంలో మిధున రాశి వారు శుభ ఫలితాలను చూస్తారని బాబా వంగా పేర్కొన్నారు. ఈ సమయంలో మిధున రాశి వారికి ధనప్రాప్తితో జీవితం బాగా మారుతుందని, గ్రహాల సానుకూల స్థానం కారణంగా డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయని వెల్లడించారు. ఇది మిధున రాశి వారికి అదృష్ట సంవత్సరంగా బాబా వంగా తెలిపారు.

కుంభరాశి
2025 లో కుంభ రాశి వారు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు. అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించగలుగుతారని, ఈ సంవత్సరం ఆర్థికపరమైన, వృత్తిపరమైన రంగాలలో గొప్ప ప్రయోజనాలను పొందుతారని పేర్కొన్నారు. శని కారణంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం ఈ సమయంలో బాగా పెరుగుతాయని తెలిపారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+