శతభిషలోకి శని.. 12 రోజుల్లో ఈ రాశుల తలరాత మారుస్తున్నాడు
చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు వచ్చేనెల మూడోతేదీన పూర్వాభాద్ర నక్షత్రం నుంచి శతభిషా నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. వాస్తవానికి గ్రహాలు రాశి సంచారం చేసినప్పుడు లేదంటే నక్షత్ర సంచారం చేసినప్పుడు మంచి ప్రయోజనాలే కాకుండా చెడు ప్రయోజనాలు కూడా రాశులవారికి కలుగుతుంటాయి. ప్రస్తుతం శనిదేవుడు శతభిషలోకి ప్రవేశించడంవల్ల ఐదు రాశులవారికి చెడు సమయం ప్రారంభమైంది. డిసెంబరు 27వ తేదీ వరకు అక్కడే ఉండే శనిదేవుడి వల్ల ఈ రాశులవారు అప్పటివరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.
తులరాశి
ఈ రాశివారంటే శనిదేవుడికి ఇష్టమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం కష్టాలు తప్పవు. ఇతరులను మోసం చేయకుండా ఉండాలి. మోసం చేస్తే కర్మలను బట్టి వెంటనే శనిదేవుడు ఫలితాలను ఇస్తాడు.

కుంభరాశి
ఈ రాశికి శని అధిపతి. వీరికి మాత్రం కలిసివస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను పూర్తిగా విస్తరించి ఆర్థికంగా లాభపడతారు.
సింహరాశి
ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. అంతేకాకుండా ఆందోళనలు పెరిగి ఒత్తిడికి గురవుతారు. ఏ తప్పు చేసినా అది పెద్దదై మెడకు చుట్టుకుంటుంది. కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది.
మీనరాశి
ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శనిదేవుడివల్ల అద్భుతాలు జరుగుతాయి. పేదలకు సాయం చేయాలి. రాజకీయ రంగంతోపాటు విద్యారంగంలో ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
మేషరాశి
వీరు తమ రోజువారీ పనుల్లో ఎటువంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. లేదంటే దాని ఫలితం చెడుగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పని తలపెట్టినా దురదృష్టం వెంటాడుతుంది. సాధ్యమైనంతవరకు కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది.
మిథున రాశి
ఈ రాశివారికి కష్టాలు తప్పవు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వాటిని తగ్గించుకోవాలి. ఆర్థిక సమస్యలతోపాటు ఇతర సమస్యలవల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండటం అవసరం.












Click it and Unblock the Notifications