రేపు కామద ఏకాదశి.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటే ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి అనేది విష్ణువుకు అంకితం. 19వ తేదీన కామద ఏకాదశి వస్తోంది. ఆరోజు చేసే విష్ణుపూజ ఎంతో మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఏకాదశి వ్రతం ఆచరించి కథ వింటే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఆరోజు నుంచి ప్రధానంగా ఐదు రాశులకు అదృష్టం కలిసిరాబోతోంది. గ్రహాల యువరాజు బుధుడు మీనరాశిలో ఉదయిస్తాడు. దీనివల్ల వీరికి ఆకస్మికంగా ధనలాభం కలగనుంది. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
మీనరాశిలో బుధుడు ఉదయించడంవల్ల ప్రధానంగా ఈ రాశివారికి బాగా కలిసిరానుంది. ఆనందం, శ్రేయస్సు కలగడంతోపాటు ఈ రాశికి చెందిన విద్యార్థులకు అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగంతోపాటు వ్యాపారాలు కూడా కలిసివస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

మిథునరాశి
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేస్తున్న ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలను ఇచ్చే సమయం ఇది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి
ఈ రాశివారికి అంతా మంచి సమయం. ఆర్థికంగా పరిస్థితులు మెరుగవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ ఫర్ అవుతారు. పై అధికారుల నుంచి పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.
కన్యారాశి
విష్ణుమూర్తి అనుగ్రహంతో ఉద్యోగంలో మార్పు కలుగుతుంది. వ్యాపారం కలిసివస్తుంది. వ్యాపారంలో భాగస్వామితో సఖ్యత ఉంటుంది. కుటుంబంలో సభ్యులంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ధనస్సురాశి
ఉద్యోగంలో మార్పు వస్తుంది. వ్యాపారం పుంజుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం మెరుగుపడటంతోపాటు విస్తరించడానికి అవకాశాలు కనపడుతున్నాయి. పూర్తిస్థాయిలో పనిచేయడంవల్ల, పనిమీద ఆసక్తి ఉండటంవల్ల వ్యాపార నిర్వహణతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications