విపరీత రాజయోగంతో రాబోయే పదిరోజుల్లో ధనవంతులవుతున్న రాశులు
రాహువు కదలికలు ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. 18 నెలలకోసారి రాహువు తన రాశిని మారుస్తుంటుంది. గతేడాది రాహువు మీనరాశిలోకి ప్రవేశించగా, మార్చి 31న శుక్రుడు కూడా అదే రాశిలోకి సంచారం చేశాడు. ఈనెల 23వ తేదీవరకు అక్కడే ఉంటాడు. రాహువు-శుక్రువు సంయోగంవల్ల విపరీత లేదా వ్యతిరేక రాజయోగం ఏర్పడింది. దీన్ని జ్యోతిష్యం ప్రకారం పవిత్రమైనదిగా భావిస్తున్నారు. రాబోయే పదిరోజుల్లో ఏయే రాశులవారు దీనివల్ల ఆర్థికంగా లాభపడతారు, వారికి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
మీన రాశి
ఈ రాశిలోనే విపరీత రాజయోగం ఏర్పడింది. వీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడటంతోపాటు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరడంతోపాటు వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో చూడని లాభాలను కళ్ల చూస్తారు. అదృష్టం ఎప్పుడూ తోడుంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

వృషభ రాశి
వ్యతిరేక రాజయోగం ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టే పెట్టుబడులు లాభాలను ఇవ్వడంతోపాటు అదృష్టం తోడుండి అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రతి పనిలో అదృష్టం కలిసివస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడతారు.
మిథున రాశి
ఈ రాశివారికి విపరీత రాజయోగం ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం రావడంతోపాటు గతంలో ఆగిపోయిన ప్రమోషన్ కూడా లభించనుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కెరీర్ లో మంచి స్థాయికి చేరుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.












Click it and Unblock the Notifications