జనవరిలో ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం.. సూర్యచంద్రుల సంయోగం వల్లే
జనవరిలో నెలలో గ్రహాల సంయోగం జరుగుతోంది. 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జరిగి నాలుగు రోజులైన తర్వాత అదే రాశిలోకి చంద్రుడు కూడా ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండు గ్రహాలు కలుస్తాయి. సూర్య, చంద్రుల కలయిక వల్ల కొన్ని రాశులపై అద్భుతమైన ప్రబావం పడుతుంది. జీవితంలో వెంటనే పురోగమిస్తారని, వృద్ధిలోకి వస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
కర్కాటక రాశి
డబ్బును అధికంగా ఆదా చేస్తారు. జీవితంలో కీలకమైన మార్పులు చటుచేసుకుంటాయి. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సూర్యచంద్రుల కలయిక వీరికి ఎంతో లాభసాటిగా మారుతుంది. ఈ రాశివారికి వరం అని చెప్పొచ్చు. సంపాదన పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. అంతేకాకుండా చిన్న చిన్న పెట్టుబడులే పెడతారు. భారీగా పెడితే సమస్యలు వస్తాయి. ఒత్తిడి తగ్గుతుంది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

మకర రాశి
ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. పదోన్నతులు వస్తాయి. జీతం పెరుగుతుంది. మీడియా, సృజనాత్మకత, రచన రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. అంతేకాకుండా వీరు చేపట్టే ప్రాజెక్టులన్నీ విజయవంతమవుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు సూర్యుడిని, చంద్రుడిని పూజిస్తే వెంటనే ఫలితం కనపడుతుంది.
మేషరాశి
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు. ఆర్థికంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి కలిసివస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. కొత్త సంవత్సరంలో వీరికి చాలా బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మంచి పేరు తెచ్చుకుంటారు.












Click it and Unblock the Notifications