ఈనెల 29 నుంచి 139 రోజులు ఈ రాశులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి
ఈనెల 29న శనిదేవుడు తిరోగమనంలో కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కుంభరాశిలోకి వచ్చిన తర్వాత శని నవంబరు 15 వరకు అక్కడే ఉంటాడు. రాహువు, కేతువు, శని లాంటి గ్రహాలు తిరోగమనంలో ప్రయాణించడంవల్ల వారి క్రూరత్వం ఇంకా పెరుగుతుందని జ్యోతిష్యంలో చెప్పారు. మంచి చేసే వ్యక్తికి శనిదేవుడు ఎప్పుడూ సాయపడుతూనే ఉంటాడు. చెడు చేసేవారిని మాత్రం కష్టాలపాలు చేస్తాడు. శనిని శాంతింప చేయడానికి ఈ ఐదు నెలలు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేషరాశి
వృత్తి, ఆర్థిక స్థితి ప్రభావితమవుతాయి. చిన్న పనులకే ఆటంకాలు ఎదురవుతుంటాయి. వ్యాపారస్తులకు కష్టాలున్నాయి. నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన లావాదేవీలకు దూరంగా ఉంటే మంచిది. లేదంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహరాశి
ఉద్యోగస్తులకు సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు పోటీదారుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులను తగ్గించుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణం విషయంలో జాగ్రత్త అవసరం.
కర్కాటకం, వృశ్చిక రాశి
ఈ రాశులవారు తమ ఆలోచనా తీరును మార్చుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. పెట్టుబడులపై శ్రద్ధ ఉండాలి. డబ్బును జాగ్రత్తగా ఖర్చుచేయాలి. లేదంటే అప్పు చేయాల్సి వస్తుంది.
కన్య
రాబోయే 139 రోజులు వీరు ఏ పని చేసినా ఉపయోగం ఉండదు. చిన్న చిన్న పనులకే తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల వల్ల ఎటువంటి ప్రయోజనం దక్కదు. శత్రువులు పెరుగుతారు. ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది.












Click it and Unblock the Notifications