ఈ రాశులకు ధనయోగాన్ని ప్రకటించిన బృహస్పతి
జ్యోతిష్యం ప్రకారం అదృష్టం, కీర్తి, భౌతిక సుఖానికి బృహస్పతి ప్రతీక. వ్యక్తి జాతకంలో గురువు శుభస్థానంలో ఆ జాతకానికి తిరుగులేదు. విపరీతమైన ధనలాభం ఉంటుంది. అదే గ్రహం ఉచ్ఛస్థితిలో ఉంటే తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. గురువు ఒక రాశి నుంచి మరోరాశిలోకి సంచరించేందుకు 12 ఏళ్ల సమయం తీసుకుంటాడు. అక్టోబరు తొమ్మిదో తేదీన గురువు తిరోగమనం చేస్తున్నాడు. అలా ఫిబ్రవరి నాలుగోతేదీ వరకు ఉంటాడు. ఈ సమయంలో ఏయే రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయో, ఏ రాశులు లాభాలను పొందుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఎక్కువ సంతోషం కలుగుతుంది. వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత వెల్లివిరుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్తగా కారును కొనుగోలు చేస్తారు. ఆస్తి కలిసివస్తుంది. కెరీర్ కు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. మొదటినుంచి వేధిస్తున్న న్యాయపరమైన విషయాల్లో సులువుగా విజయం అందుకుంటారు.

కర్కాటక రాశి
న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడతారు. వీరికి ఆదాయం పెరుగుతుంది. బుధుడి అనుగ్రహంతో ధనవంతులు అవుతారు. అనేక రకాల కోరికల నుంచి బయటపడతారు. ఊహించనిరీతిలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారానికి సంబంధించి కొత్త కొత్త డీల్స్ కుదురుతాయి. ఆదాయం కూడా ఊహించనిరీతిలో పెరుగుతుంది.
మిథున రాశి
వీరికి ఉన్నపళంగా అదృష్టం రెట్టింపు అవుతుంది. డబ్బు కూడా బాగా పెరుగుతుంది. వీరికి కొత్త ఆదాయ వనరులు తోడవుతాయి. పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని భవిష్యత్తులో అందిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పిల్లలకు చదువుపై ఏకాగ్రత పెరిగి తల్లిదండ్రులు సంతోషిస్తారు. అనుకున్న స్థాయిలో లాభాలను రాబడతారు.












Click it and Unblock the Notifications