నవంబరు 17 నుంచి ఈ రాశులకు మహర్దశ
నవంబరు నెలలో శక్తివంతమైన గ్రహాలు గోచారం చేయనున్నాయి. సూర్యుడు 17వ తేదీన వృశ్చికా రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశులవారికి
అత్యంత శుభ పరిణామాలు కలగనున్నాయి. వీరికి అంతులేని ధన సంపద, అభివృద్ధి ఉంటుంది. సూర్యుడు ఏ రాశిలో అయినా నెలరోజులే ఉంటాడు. ఈ గోచారం వల్ల ఈ నాలుగు రాశులవారికి ఏవిధంగా శుభాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి : సూర్యుడు ఇదే రాశిలో గోచారం చేస్తున్నాడు. వీరి అదృష్టం మారిపోనుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలుంటాయి. విదేశీయానం ఉంటుంది. జీవితంలో ఊహించని రీతిలో ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా బలోపేతమవుతారు.

మకర రాశి : పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రమోషన్ ఇంక్రిమెంట్ తో కలిపి లభిస్తుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారస్తులకు లాభాలుండటంతోపాటు వారి వ్యాపారాలు బాగుంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు కలుగుతాయి.
వృషభరాశి : సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉన్నాయి. ప్రతి నెలా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బ్రహ్మచారులకు పెళ్లి కుదురుతుంది. ఆర్థికంగా ఏ సమస్యలు ఇబ్బంది పెట్టవు. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సింహరాశి : సింహ రాశి జాతకులకు అంతా అనుకూలమైన పరిణామాలే కలుగుతాయి. కొత్త వాహనం లేదా కొత్త ఇళ్లు కొనుగోలు చేస్తారు. కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కోరికలు నెరవేరతాయి. ధన లాభం ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు.












Click it and Unblock the Notifications