త్వరలో వీరికి జాక్ పాట్.. వరమిచ్చిన రుచక రాజయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి అనే విషయం తెలిసింది. గ్రహాలు వివిధ రాశుల లోకి మారినప్పుడు, మరికొన్ని గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. సెప్టెంబర్ నెలలో కుజుడు రాశి మార్పు చెందడంతో రుచక రాజయోగం ఏర్పడుతుంది.
రుచక రాజయోగం
ఈ రుచక రాజయోగం మహాపురుష రాజయోగంగా చెప్పబడింది. కుజుడు ధైర్యసాహసాలకు కారకుడిగా చెబుతారు. అటువంటి కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశి లోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే రుచక రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

సింహరాశి
రుచక రాజయోగం కారణంగా సింహరాశి జాతకులకు సెప్టెంబర్ మాసంలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది. వీరి కెరీర్లో సోషల్ నెట్వర్కింగ్ పడుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇది సింహ రాశి వారికి అదృష్ట సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రుచక రాజ యోగం కారణంగా అన్ని విధాల కర్కాటక రాశి వారికి కలిసివస్తుంది. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి జాతకులు మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి భర్తలు, భార్యలకు బంగారు ఆభరణాలు కొనిస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి రుచక రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా శుభప్రదంగా ఉంటుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications