ఫిబ్రవరి నుంచి ఈ రాశుల మాటే శాసనం... పట్టిందల్లా బంగారమే

ఖగోళంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలను ఏర్పరచడంతోపాటు కొన్ని రాశి చక్రగుర్తులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తుంటాయి. ఇలా రాశి సంచారం చేసేందుకు ఒక్కో గ్రహం ఒక్కో సమయం తీసుకుంటుంది. గ్రహాలకు రాజైన సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేందుకు గరిష్ఠంగా 30 రోజులు తీసుకుంటాడు. శనిదేవుడు మాత్రం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేందుకు అత్యంత నెమ్మదిగా ప్రయాణించి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటుంది. రాహువు, కేతువు 18 నెలల సమయం తీసుకుంటాయి. తాజాగా
గ్రహాలకు రాకుమారుడైన బుధుడు సంచారం చేయడంవల్ల మూడు రాశులవారు అత్యధిక లాభాలను పొందబోతున్నారు. రుణబాధలన్నీ తీరిపోయి ఆర్థికంగా కుదుటపడుతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి
ఈ రాశివారికి విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కుతారు. అందుకు అదృష్టం కలిసివస్తుంది. ఆదాయం పెరగడంతోపాటు నలువైపుల నుంచి డబ్బు వస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. గొడవలన్నీ తగ్గిపోతాయి.

three zodiac signs amezing benefits and huge money due to mercury transit in february month

కర్కాటక రాశి
రుణ బాధలన్నీ తొలగిపోవడంతోపాటు ఇతరులకు డబ్బులిచ్చే స్థాయికి ఎదుగుతారు. అయితే ఆ డబ్బును తిరిగి పొందగలమా? లేదా? అని ఆలోచించుకొని ఇవ్వాలి. లేదంటే కష్టమవుతుంది. డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది. తర్వాత ఇబ్బందులు తప్పవు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని డబ్బును మంచి పెట్టుబడుల్లో పెట్టి భవిష్యత్తులో ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. ఈ రాశివారికి ఇది చాలా మంచి సమయం అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

మేషరాశి
వీరికి తిరుగులేని ప్రయోజనాలు కలుగుతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం అవడమే కాదు.. వీరు చెప్పిందే వేదం.. వీరు మాట్లాడిందే శాసనం. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొత్త వ్యాపారాలను ప్రారంభింస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఫిబ్రవరి నుంచి ఈ రాశులకు తిరుగులేదని చెప్పొచ్చు. ప్రతి పనిలోను విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగి అన్యోన్యంగా ఉంటారు. అనుబంధం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో కలిసిమెలిసి జీవిస్తారు. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+