అర్థకేంద్ర రాజయోగంతో ఈ రాశులకు అద్భుతమైన ధనయోగం
దేవతల గురువైన బృహస్పతి, గ్రహాల రాకుమారుడైన బుధుడు కలిసి శక్తివంతమైన అర్థ కేంద్ర రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు. గురువు జ్ఞానానికి, వివాహానికి, సంతానానికి, ఆధ్యాత్మికతకు కారకుడు. బుధుడు తెలివితేటలకు, తర్కానికి, వ్యాపారానికి కారకుడు. వీరిద్దరూ కలవడంవల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయిన జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఊహించని విధంగా సంపదను పొందుతారని చెబుతున్నారు.
మిథున రాశి
కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. పాత సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. కొత్త సమస్యలు రాకుండా వ్యక్తిగత ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. ఊహించని రీతిలో ధనలాభం ఉంది. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని, గురుడిని పూజిస్తే అనుకున్న పనులు శీఘ్రంగా జరుగుతాయి.

సింహరాశి
కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల విజయాలు సొంతమవుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో లోతుగా ఆలోచిస్తారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. మొత్తంగా ఈ రాశివారు అద్భుతమైన ప్రయోజనాలను సొంతం చేసుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సంపాదన భారీగా పెరుగుతుంది.
తులారాశి
ఆదాయం సమృద్ధిగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగాలు చేసేవారు శుభవార్తలు వింటారు. ఒకరకంగా ఈ రాశివారికి మంచిరోజులు ప్రారంభమైనట్లే. జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు బలపడతారు. ఎదుటివారితో మాట్లాడే విషయంలో గొడవలు రేగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం ఉత్తమం.












Click it and Unblock the Notifications