29న మౌని అమావాస్య... పేదలు కూడా కోటీశ్వరులవుతున్నారు
ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య అంటే ఆరోజు మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనే అర్థం వస్తుంది. ప్రయాగ్ రాజ్, హరిద్వార్ లాంటిచోట్ల పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఉపవాసం ఉండటంతోపాటు మౌనంగా ఉండటంద్వారా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అనుభవిస్తారు. దేవతా మూర్తులను ఆరాధించడం ఆనవాయితీగా యుగాల తరబడి వస్తోంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆ రోజు ఎంతో శక్తివంతమైన త్రివేణి యోగం ఏర్పడుతోంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావితమవుతున్నప్పటికీ ప్రధానంగా మూడు రాశులవారు మాత్రం మంచి ప్రయోజనాలు దక్కించుకుంటున్నారు.
తులారాశి
భౌతికంగా చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. ఎప్పటినుంచో అనుకుంటున్న ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. తల్లితో అనుబంధం బాగా పెరుగుతుంది.

వృషభరాశి
ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరికలు కూడా అన్నీ నెరవేరతాయి. వ్యాపారాల్లో ఉన్నవారికి దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. అవి కూడా మంచి లాభాలను కలిగిస్తాయి. ఎదుటివారికి డబ్బు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో మంచి రాబడి ఉంటుంది.
మకర రాశి
వ్యక్తిగత జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. చేస్తున్న పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆరంభించడంతోపాటు ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులకు ఊహించనిరీతిలో లాభాలు కలుగుతాయి. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది.












Click it and Unblock the Notifications