మహాలక్ష్మీ రాజయోగంతో ఈ రాశుల పంట పండింది
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తాయి. ఇలా సంచారం చేసే సమయంలో కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల రాశిచక్ర గుర్తులు ప్రభావితమైన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయానికి కుజుడు కూడా అదే రాశిలో ఉంటాడు. ఈ రెండు గ్రహాల కలయికవల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. ఈనెల 28వ తేదీ వరకు 54 గంటలు ఉండే ఈ యోగం వల్ల మూడు రాశులవారికి అపరిమితమైన ప్రయోజనాలు దక్కుతున్నాయి.
సింహ రాశి
రాజకీయాల్లో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. బంధువుల దగ్గర మాట చెల్లుబాటు అవుతుంది. డబ్బుకు సంబంధించి మంచి స్థాయిలో ఉంటారు. కొంతకాలం నుంచి మీరు కష్టపడుతున్న పనికి సంబంధించి ఫలితాలు అందుతాయి. మంచి విజయాన్ని సాధిస్తారు. కొత్తగా కారును కొనుగోలు చేస్తారు. లేదంటే ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశివారిపై ఉంటుంది.

మిథున రాశి
పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఇప్పటివరకు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. అందరూ కలిసి విహార యాత్రకు లేదంటే పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారికి సమయం అనుకూలంగా ఉంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. కొత్తగా పనిని ప్రారంభించాలనుకుంటే ఇది మంచి సమయం. మంచి రాబడులు వస్తాయి.
మీన రాశి
మీ పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరుగుదలతోపాటు ప్రమోషన్ ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. పెళ్లికానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. డబ్బున్నవారితో సంబంధం కుదురుతుంది. చేస్తున్న పనిలో సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే అది పెరిగి పెద్దయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications