మే 7వ తేదీ నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈనెల 14వ తేదీన మేషరాశిలోకి సంచారం చేశాడు. నెలరోజులు అదే రాశిలో సంచారం చేస్తాడు. వచ్చే నెల 7వ తేదీన మేషరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. సూర్యుడు, బుధుడు కలవడంతో మేషరాశిలో బుధాదిత్య రాజయోగం మే 7వ తేదీన ఏర్పడబోతోంది. ఈ ప్రభావం 9 రోజులు ఉంటుంది. ఈ తొమ్మిదిరోజుల్లో మూడు రాశులవారు మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. అంతేకాకుండా వీరు చేపట్టే ప్రతి పనికి అదృష్టం తోడుంటుంది. ఆ మూడు రాశుల వివరాలను తెలుసుకుందాం.
తులారాశి
బుధాదిత్య రాజయోగం ప్రభావం ఉండే సమయంలో ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. ఏ పనినైనా సులువుగా పూర్తిచేస్తారు. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును పొదుపు చేయడంతోపాటు కొత్త వ్యాపారాల్లోకి మళ్లిస్తారు. ఉద్యోగస్థులకు ఈ సమయంలోనే ప్రమోషన్ ఉంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంవల్ల అనుకున్న ఫలితాలకన్నా ఇంకా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు.

కుంభ రాశి
కుటుంబ సభ్యల మధ్య అనుబంధం బలపడుతుంది. వారితో సంతోషంగా గడుపుతారు. అందరూ కలిసి తీర్థయాత్రలకుకానీ, విహార యాత్రలకు కానీ వెళతారు. చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. వ్యాపారస్తులు, ఉద్యోగులు, వృత్తిలో ఉన్నవారంతా వారి వారి రంగాల్లో బాగా రాణిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ తొమ్మిది రోజులు వీరికి ఎంతో అనుకూలం. శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.
మిథున రాశి
ఈ తొమ్మిదిరోజులు వీరికి తిరుగులేదు. పనులు అవకుండా పెండింగ్ లో ఉండిపోయిన పనులన్నీ ఈ తొమ్మిది రోజుల్లోపే పూర్తవుతాయి. అలాగే ఆధ్యాత్మిక వాతావరణం పట్ల మొగ్గుచూపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి ధైర్యంగా తీసుకుంటారు. అవి సక్సెస్ అవుతాయి. స్నేహితులు, బంధువులు, సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన విషయాలపై ఈ సమయంలో దృష్టిసారిస్తారు.












Click it and Unblock the Notifications