గజకేసరి రాజయోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం..!
ఈనెల 28వ తేదీన చంద్రుడు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశించాడు. అదే సమయానికి బృహస్పతి కూడా అదే రాశిలోకి సంచారం చేస్తాడు. ఇలా ఈ రెండు గ్రహాలు కలవడంవల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది. కొన్ని రాశులవారికి ఈ యోగం అదృష్టాన్ని మోసుకొస్తోంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కోటీశ్వరులవుతారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మొత్తం ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటున్నప్పటికీ అత్యధిక ప్రభావానికి గురయ్యే మూడు రాశుల వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
గజకేసరి రాజయోగంతో ఈ రాశివారికి విపరీతమైన లాభాలున్నాయి. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోయి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. జీవితంలో విజయాలను సాధిస్తారు. వ్యాపారస్తులు భారీ ఆర్డర్లు అందుకుంటారు. డబ్బును, వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లిస్తారు.

కుంభ రాశి
ఈ రాశివారికి ఊహించని రీతిలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. సంపాదన పెరిగి డబ్బును పొదుపు చేస్తారు. ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడి పెడతారు. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. పొదుపు చేసే విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మిథున రాశి
గజకేసరి రాజయోగం వీరికి అదృష్టాన్ని మోసుకొస్తోంది. అన్నివిధాలుగా వీరికి అనేక లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు విజయాలను అందుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలతోపాటు గౌరవ మర్యాదలు కూడా కలుగుతాయి. గతం నుంచి వెంటాడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. శుభవార్తలను అందుకుంటారు. అందరిపై నమ్మకాన్ని పెంచుకుంటారు.












Click it and Unblock the Notifications