144 ఏళ్ల తర్వాత శివరాత్రి రోజు వజ్రయోగం... ఈ రాశులకు అఖండ ధనయోగం

మహా శివరాత్రి రోజు అత్యంత శక్తివంతమైన వజ్రయోగం ఏర్పడుతోంది. దీనివల్ల మొత్తం 12 రాశులు ప్రభావితమవుతాయి. వాస్తవానికి గ్రహాలు రాశి సంచారం చేసే సమయంలో ఏర్పడే యోగాలు రాశిచక్ర గుర్తులకు మంచి ఫలితాలను కలుగజేస్తాయి. బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం, గజకేసరి యోగం, పారిజాతక యోగం, లక్ష్మీనారాయణ యోగంలాంటివి ఏర్పడుతుంటాయి.

అయితే వీటన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన వజ్రయోగం శివరాత్రి రోజు ఏర్పడుతోంది. సూర్యుడు, బృహస్పతి, శనిదేవుడు ఒకే సరళరేఖ మీదకు రావడంవల్ల 144 సంవత్సరాల తర్వాత వజ్రయోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశులవారు అత్యంత శుభ ఫలితాలను పొంది జాక్ పాట కొడతారు. వారి వివరాలను తెలుసుకుందాం.

three zodiac signs will get huge money and all benefits due to vajra yogam on mahashivratri

కన్యా రాశి
ఈ రాశివారికి సోదరుల నుంచి విశేషమైన ధనయోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీటితోపాటు కీర్తిని సంపాదిస్తారు. విదేశాలకు వెళ్లడానికి ఇది వీరికి మంచి అవకాశం. ఆ యోగం కూడా వీరికి ఉంది. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది.

సింహరాశి
కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసుల్లో సులభంగా విజయం సాధిస్తారు. దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా లాటరీల్లాంటివి తగిలి ఆకస్మిక ధనలాభం ఉంది. ఇక రాదు అనుకొని మీరు వదిలేసిన పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం కలిసివస్తుంది. ఈ రాశులవారంతా పరమేశ్వరుణ్ని ఆరాధించాలి. శివాలయానికి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. అంతేకాదు.. తెల్లటి పూలు శివయ్యకు సమర్పిస్తే బ్రహ్మాండంగా కలిసివస్తుంది.

మకర రాశి
వజ్ర యోగంవల్ల మంచి ధనలాభం ఉంది. పిల్లల విషయంలో సమాజంలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. స్తిరాస్థి వ్యాపారంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. విలాసవంతమైన జీవితంతోపాటు విందులు, వినోదాల్లో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+