రూటు మార్చిన శని... ఈ రాశులపై ధన వర్షం
నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు ధర్మానికి ప్రతీక. ఆయన న్యాయదేవుడు. మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తన రాశిని మారుస్తుంటాడు. అందుకు కారణం అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని. అందరూ శని అంటే భయపడతారు.
కానీ మనం మంచిపనులు చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శనిదేవుడిని పూజిస్తే రెట్టింపు ఫలితాలను ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే నిరుపేద కూడా జమిందారు అవుతాడు. ఈ ఏడాది తన స్థానాన్ని మార్చుకుంటున్నశని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మార్చి 29న ఈ పరిణామం చోటుచేసుకుంటుంది. దీనివల్ల ఏయే రాశులకు కలిసివస్తుంది అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

తులా రాశి
వీరికి అదృష్టం బాగా కలిసివస్తుంది. న్యాయ సంబంధిత విషయాల్లో అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అందుకు మీ కెరీర్ దోహదపడుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీకు వృద్ధిని కలిగిస్తాయి. కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
మకర రాశి
ఈ రాశివారికి శనిదేవుడు ఈ సంవత్సరం అత్యధిక లాభాలను ఇస్తున్నాడు. దీనివల్ల ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్నిపనులు పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇది అనువైన సమయం. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తారు. ఎదుటివారికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగివుంటారు.
వృషభ రాశి
అనుకోకుండా వీరు అతి పెద్ద విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు అధికంగా ఉన్నాయి. వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాలపై పెట్టుబడి పెడతారు. వీరికి ఊహించనిరీతిలో ఆదాయం పెరుగుతుంది. ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. అలాగే దాంపత్య జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని చవిచూస్తారు. మనసు చాలా సంతోషంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications