2025లో ఈ రాశులు మట్టి పట్టుకున్నా వజ్రం అవుతుంది
సంపదకు, శ్రేయస్సు, లగ్జరీ జీవితానికి కారకుడైన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని రాశులకు మాత్రం అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభంతోపాటు విపరీతమైన లాభాలున్నాయి. శుక్రుడు రాక్షసులకు గురువు. ఈనెల 28వ తేదీన మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. దీనివల్ల మూడు రాశులవారు విపరీతమైన అదృష్టవంతులవడంతోపాటు అపారమైన సంపదను పొందుతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఆయన సొంత రాశిలోని కర్మ ఇంట్లోకి వెళుతున్నాడు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించే యోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. నిరుద్యోగులుగా ఉన్నవారికి అదృష్టం వరిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న కలహాలన్నీ తొలగిపోతాయి. భాగస్వామి సలహాతో చేసే పనులన్నీ డబ్బులను తెచ్చిపెట్టేవే.

మేష రాశి
ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఆదాయంతోపాటు లాభం ఇంట్లో ఉంటాడు. దీనివల్ల వీరికి అనేకరకాలుగా ఆదాయం పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా భారీ లాభాలను పొందుతారు. స్టాక్ మార్కెట్ వ్యాపారాలవైపు దృష్టి సారించేవారికి, అందులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వృద్ధి సాధిస్తారు. వ్యాపారస్తులకు భారీ ఆర్డర్లు వస్తాయి. ఒప్పందాలు పెద్దస్థాయిలో కుదురుతాయి.
మిథున రాశి
అదృష్టం తోడుంటుంది. పేదలకు వారి ఇంట్లో నిత్యావసర వస్తువులు, ఆహారం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. సామాజిక కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది. మంచి పనులు చేస్తుంటారు. చేపట్టే ప్రతి పనిలో అదృష్టం కలిసివచ్చి సజావుగా పూర్తవుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం ఉంది. పెద్దల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.












Click it and Unblock the Notifications