2025లో ఈ రాశులను శనిదేవుడు దరిద్రంలా గట్టిగా పట్టుకుంటున్నాడు... జాగ్రత్త!

జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో శనిదేవుడు కర్మదాత. మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. అలాగే ఆయన న్యాయదేవత కూడా. కర్మలను బట్టి కష్టమైన ఫలితాలు వస్తున్నా కొన్ని సందర్భాల్లో ఎంతో మంచి చేయగల ఉదాత్త స్వభావం కలవాడు. ఆయనకు మందగమనుడు అనే పేరుంది. ఎందుకంటే ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు.

ఇంత సమయం తీసుకునే గ్రహం శని ఒక్కటే. వచ్చే ఏడాది శనిదేవుడు మార్చి నెలాఖరున కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఏడున్నర సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఏలినాటి శని ప్రభావం తొలగిపోతోంది. అయితే మేష రాశివారికి మాత్రం ఏడు సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది.

three zodiac signs will get somany problems due to lord shnai transit pisces

కుంభ రాశి
ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. డబ్బుకు ఇబ్బంది ఏర్పడుతుంది. మరో రెండున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంత కష్టపడినా ఫలితం రాదు. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అనారోగ్యం కలుగుతుంది. ఉన్న డబ్బును ఖర్చుపెట్టకుండా ఉండటం మంచిది. అయితే వివాహం కుదిరే అవకాశం ఉంది.

మేషరాశి
ప్రతి శనివారం వీరు శనిదేవుడికి నల్ల నువ్వులతో పూజ చేయడంతోపాటు తైలాభిషేకం చేయాలి. ఆదాయం తగ్గుతుంది. అప్పులు పెరుగుతాయి. మానసిక ఆందోళన ఉంటుంది. అనారోగ్యం కలుగుతుంది. అనుకోని చికాకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. శనిదేవుడి పూజలవల్లే కాస్తంత ఉపశమనం కలుగుతుంది.

మీన రాశి
అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలను ఎవరూ పట్టించుకోరు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ అవి ఫలించవు. కాకపోతే పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగం కలిసిరాదు. ఈ రాశివారికి ఐదు సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది.

పరిహారాలు
శనివారం ఆంజనేయస్వామిని పూజించడంద్వారా శని ప్రభావం నుంచి బయటపడతారు. ప్రతి శనివారం అన్నదానం చేయాలి. బ్రాహ్మణులకు దానమివ్వడంతోపాటు పేదలకు ధర్మం చేయాలి. దీనివవల్ల శనిదేవుడి శుభ దృష్టి కలుగుతుంది. చీమలకు పంచదార తినిపిస్తే శని ప్రభావం అరగంట తగ్గుతుంది. శనివారం 11సార్లు శనిదేవుడి స్తోత్ర పారాయణ చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+