ప్రబోధిని ఏకాదశి నేడే.. ఈరోజే బుధాదిత్య రాజయోగం, రెండు పంచ మహాపురుష యోగాలు!!
సనాతన ధర్మంలో కార్తీకమాసానికి, శ్రీ మహావిష్ణువు పూజకు చాలా విశేషమైన స్థానం ఉంటుంది. కార్తీక మాసాన్ని విష్ణుమూర్తికి అంకితమైన మాసంగా చెప్తారు. నారద పురాణంలో కార్తీక శుక్ల పక్ష ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అత్యంత ప్రధానమైంది. కార్తీక శుక్ల పక్ష ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ప్రబోధిని ఏకాదశి, దేవ్ ఉథాని ఏకాదశి కార్తీక మాసంలోని శుక్లపక్షం లోని 11వ రోజున వస్తుంది.
విష్ణు నిద్రించు నాలుగు నెలల చాతుర్మాస కాలం ఈరోజుతో ముగుస్తుంది. ఈ రోజున తులసికి వివాహ వేడుకను నిర్వహిస్తారు. ప్రబోధిని ఏకాదశి 22వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాల నుండి ప్రారంభమై 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది .ఇక ఇదే రోజున రెండు ముఖ్యమైన శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇవి వివిధ రాశుల వారికి సానుకూల ఫలితాలను కూడా ఇస్తున్నాయి.

ప్రబోధిని ఏకాదశి నాడు విష్ణు భగవానుడికి ద్రాక్ష, దానిమ్మ, అరటి పండ్లు మొదలైన నైవేద్యంగా సమర్పించి, మంత్రాలతో, విష్ణు నామస్మరణతో నిష్టగా భగవంతుని పూజిస్తే అందరూ సంతోషంగా ఉంటారని, సుఖశాంతులతో జీవిస్తారని నమ్ముతారు. ప్రబోధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి అత్యంత నిష్టతో విష్ణుమూర్తి ని పూజిస్తే విష్ణు సాయుజ్యం లభిస్తుందని చెప్తారు.
ఈ ఏకాదశి అతి పెద్ద ఏకాదశిగా భావిస్తారు. విష్ణుమూర్తికి శ్రీమహాలక్ష్మికి వివాహం జరిగింది ఈ రోజేనని చెబుతారు.ప్రబోధిని ఏకాదశి రోజున ఊహించని అందమైన యాదృచ్ఛిక సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. ఇదే రోజున బుధాదిత్య రాజయోగం, శష మరియు రుచక్ మహాపురుష రాజయోగాలు ఏర్పడనున్నాయి.
దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం సిద్ధిస్తుంది. శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనే ఈరోజు ఈ రెండు యోగాలు సంభవించనున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రబోధిని ఏకాదశికి ప్రాధాన్యత వచ్చింది. ఈ ఏకాదశినే దేవ ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications