త్రిగ్రాహి యోగం త్వరలోనే: ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు వేరువేరు రాశి చక్రాలలో రవాణా అవుతున్నప్పుడు, వాటి స్థానాలను బట్టి వివిధ యోగాలు, రాజయోగాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం నవంబర్ 17వ తేదీన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇది మొత్తం 12 రాశుల వారి పైన ప్రభావం చూపుతున్నప్పటికీ మూడు రాశుల వారి ఆర్థిక పరిస్థితులలో ఉన్నతి గణనీయంగా కనిపిస్తుంది.
సూర్యుడు వృశ్చిక రాశి లోకి ప్రవేశించినప్పుడు అక్కడ బుధుడు, కుజుడు అప్పటికే ఉండడంతో, ఈ మూడు గ్రహాల కలయిక పవిత్రమైన త్రిగ్రాహి యోగంగా మారుతుంది. దీనివల్ల నవంబర్ 17వ తేదీ నుండి తులా రాశి, సింహ రాశి, మకర రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.

తులారాశి
త్రిగ్రాహి యోగంలో తులా రాశి వారికి పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఈ సమయం వ్యాపార ఒప్పందాలను చేసుకోవడానికి సరైన సమయం. ఊహించని సంపద వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్తక, వాణిజ్యాలు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి. తులా రాశి వారుఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు.
సింహరాశి
సింహ రాశి వారికి త్రిగ్రాహి యోగం ఉత్తమ కాలంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో సింహ రాశి వారు బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. మీరు ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించిన మెరుగైన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం లాభాలను ఆశించవచ్చు. ఉద్యోగం చేసుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి
త్రిగ్రాహి యోగం వల్ల మకర రాశి వారికి అత్యుత్తమ లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేసే వివిధ రకాల ఆర్థిక వనరులు మీకు అందుతాయి. పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఊహించని ధన లాభాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications