Ugadi 2025 horoscope: మకరరాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం!
విశ్వావసు నామ ఉగాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఉగాది నుంచి మకర రాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుందా? అంటే అనేక విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
మకర రాశి వారికి ఏలినాటి శని నుండి విముక్తి
ఈ సంవత్సరం మకరరాశి వారి ఆదాయం 8, వ్యయం 14 ,రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి మార్చి 29 తో ఏలినాటి శని తొలగిపోతుంది. వీరి జీవితంలో ఇకనుంచి సానుకూల మార్పులు సంభవించబోతున్నాయి. 2025 విశ్వావసు నామ సంవత్సరం వీరికి ఉద్యోగంలో పురోగతిని కలిగిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ రాశి వారి జీవితం ఈ సమయంలో కొత్త పుంతలు తొక్కుతుంది.

పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం
మే 25వ తేదీన గురువు ఆరవ స్థానంలోకి మారడం వల్ల ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మకర రాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు విషయంలో ఎవరిని అతిగా నమ్మకూడదు. అయితే ఈ సంవత్సరం వీరికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.
మకరరాశి వారికి ధనలాభం
ఈ రాశి వారికి మే నెల తర్వాత బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. ఏ పని చేసినా ధనలాభం కలుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి నూతన పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో చేసే ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications