లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే వాస్తు ప్రకారం ఇంట్లో ఉత్తర దిశలో ఉండకూడని వస్తువులు
సనాతన ధర్మంలో 'వాస్తు శాస్త్రం' కేవలం ఇళ్ల నిర్మాణానికి సంబంధించినదే కాదు.. మన జీవితాల్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించే ఒక మార్గం. పంచభూతాల కలయికతో నిర్మితమయ్యే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో వాస్తు నిర్దేశిస్తుంది. ముఖ్యంగా ఇంటి ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన 'కుబేరుడి' స్థానంగా భావిస్తారు. ఈ దిశను ఎంత పవిత్రంగా, వాస్తుకు అనుకూలంగా ఉంచుకుంటే అంతటి ఆర్థికాభివృద్ధి లభిస్తుందని అందరి నమ్మకం. ఉత్తర దిశలో పొరపాటున కూడా ఉండకూడని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం.
బరువులు పెట్టకండి.. అడ్డంకులు సృష్టించకండి!
ఉత్తర దిశ ఎప్పుడూ తేలికగా, విశాలంగా ఉండాలి.
ఈ భాగంలో భారీ ఫర్నిచర్, పనికిరాని పాత సామాగ్రి లేదా
బరువైన యంత్రాలను ఉంచడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి ఆగిపోతుంది.
ఫలితంగా ఆర్థికంగా ఎదగాలనుకునే మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
ఈ ప్రాంతాన్ని ఎంత ఖాళీగా ఉంచితే, అంతలా సంపద ప్రవాహం పెరుగుతుంది.

వంటగది, స్నానపు గదులకు నో ఎంట్రీ!
వాస్తు ప్రకారం ఉత్తర దిశలో వంటగది లేదా స్నానపు గది నిర్మించడం పెద్ద దోషం.
వంటగది 'అగ్ని'కి సంకేతం.
కుబేర స్థానంలో అగ్ని ఉంటే అది సంపదను హరిస్తుంది.
స్నానపు గది లేదా టాయిలెట్స్ వల్ల కలిగే అశుభ్రత ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది.
అందుకే ఈ దిశలో ఈ గదులు లేకుండా చూసుకోవడం శ్రేయస్కరం.
అభివృద్ధిని ఆపే మెట్లు!
ఇంటి ఉత్తర భాగంలో మెట్లు ఉండటం వల్ల వ్యాపారంలో నష్టాలు లేదా
ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది ఇంటి యజమాని ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇంటి మధ్యభాగంలో లేదా ఉత్తరంలో మెట్లు ఉండటం అభివృద్ధిని అడ్డుకున్నట్లే.
ఎరుపు రంగు.. పదునైన వస్తువుల ప్రభావం!
ఉత్తర దిశ 'నీటి' తత్త్వాన్ని కలిగి ఉంటుంది.
దీనికి విరుద్ధమైన ఎరుపు రంగు వస్తువులను ఇక్కడ ఉంచడం వల్ల
ఇంట్లో అనవసర కలహాలు, మనస్పర్థలు వస్తాయి.
అలాగే కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఇక్కడ ఉంచకూడదు.
ఇవి స్థిరత్వాన్ని దెబ్బతీసి, మనశ్శాంతిని దూరం చేస్తాయి.
ఆగిపోయిన గడియారాలు.. వాడిపోయిన మొక్కలు!
మీ ఇంటి ఉత్తర దిశలో ఆగిపోయిన గడియారాలు ఉన్నాయా?
అయితే వెంటనే వాటిని తొలగించండి.
పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, పాడైన గడియారాలు మీ జీవితంలో కూడా జాప్యాన్నితీసుకొస్తాయి.
అలాగే వాడిపోయిన మొక్కలు లేదా ఎండిపోయిన పూల కుండీలు
ఇక్కడ ఉంచితే నిరాశ, నిస్పృహలు దరిచేరతాయి.
ఇక్కడ ఎప్పుడూ పచ్చని, జీవకళ ఉట్టిపడే మొక్కలను ఉంచడం శుభప్రదం.












Click it and Unblock the Notifications