వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటి దిశలు - శుభాశుభ ఫలితాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

స్వంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి అనేక రకాలుగా వ్యయ ప్రయాసలు పడుతుంటారు. కలగన్న గృహం సాకారం కావాలంటే మన గ్రహ దశ బాగుండాలి.జాతక ప్రకారం గృహ యోగానికి దశ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గృహా యోగం ఏర్పడుతుంది.కట్టే / కొనే ఇల్లు అన్ని విధాలుగా వాస్తు ప్రకారం దిశకొలతలు అనుకూలంగా ఉండాలి.

దిశ సరిగా లేకపోతే మన దశకూడ సహకరించదు.అందుకే అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి వారిచ్చే శాస్త్ర సూచనలను పాటిస్తే అన్ని విధాల శుభంగా ఉంటుంది. ఇంటి దిశమారుతే వాస్తు పరంగా శుభాశుభ శాస్త్ర ఫలితాలు ఎలా ఉంటాయో గమనిద్దాం.

Vastu for Residential House, How you will get positive results

ఇంటి పడమర,దక్షిణ దిశలలో వీధులు ఉండే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు.నైరుతి బ్లాకు వాస్తు ప్రకారంగా ఉండి అలాంటి స్థలాలలో పెద్ద పెద్ద కట్టడాలు ఉంటే, వ్యాపార రంగంలో బాగా రాణింపు ఉంటుంది.

నైరుతి మూలలో మనకున్న స్థలం మొత్తం మిగితా దిశలకంటే ఎత్తుగా ఉండాలి. నైరుతి దిశ ఎత్తుగా ఉండడం వలన ఆధాయభివృద్దితో పాటు కార్యసిద్దిని కలుగజేస్తుంది.

నైరుతి మూల దక్షిణ ఆగ్నేయం వైపు గాని పశ్చిమ వాయువ్యం వైపు కాని తక్కువ కాకుండా పెంపు లేకుండా ఖచ్చితంగా మూలమట్టానికి '90' డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.

దక్షిణ నైరుతి పెరుగుదల వలన నైరుతి వీధిపోట్లు,అందులో బావులు,బోర్లు ఉండి పల్లంగా ఉంటే అందులో నివసించే స్త్రీలకు దీర్ఘవ్యాదులు మరియు వివిధ ప్రమాదాలకు గురి అయ్యే సూచనలున్నాయి.పోలీస్ లేదా కోర్టు సంబంధిత చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది.

పశ్చిమ నైరుతిలలో దోషాలు ఉన్నట్లైతే పురుషులు దుష్పాలితాలను అనుభవించాల్సి వస్తుంది.

గృహనికి గృహావరణానికి పడమర వాయవ్యంలో కాని, దక్షిణ ఆగ్నేయంలో కాని ద్వారాలు ఉండాలి.గృహనికి

గృహావరణానికి దక్షిణ, పశ్చిమ నైరుతిలలో ద్వారాలు ఉంటే అనారోగ్యంతో పాటు అనేక ఇబ్బందులతో జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. పడమర,దక్షిణాలలో గృహనికి ఫ్లోరింగ్ లెవెల్ కన్నా అరుగులు ఎత్తుగా ఉండాలి, పల్లంగా ఉండ కూడదు.

తూర్పు ఈశాన్యం తగ్గి, పశ్చిమ నైరుతిలో ద్వారాలు ఉండకూడదు.

ఇంటి ఉత్తరం దిశ హద్దు చేసి దక్షిణ నైరుతిలో ద్వారమున్న అందుగల స్త్రీలు సుఖము తక్కువగా ఉంటుంది.

గృహానికి ఉత్తర ఈశాన్యం తగ్గిపోయి తూర్పు హద్దుపై నిర్మణం గల ఇంటికి నైరుతి దోషాలు ఉంటే ఆ ఇంట్లో మగ సంతానం కలగక దత్తత తీసుకు రావడమో, ఇల్లరికపు అల్లుల్లకు ఆస్తి సంక్రమించడం జరుగుతుంది.

నైరుతి దిశలో ఏలాంటి లోపం ఉండకూడదు .ఈశాన్యంలో పొయ్యి ఉండి నైరుతిలో ద్వారాలు ఉంటే అందులో నివసించే దంపతులలో అన్యోన్నతలు లోపిస్తాయి.నైరుతి దిశ వైపు పల్లంగా ఉండకూడదు,బావి ఉండకూడదు. గృహనికి నైరుతి భాగంలో ఎతైన అరుగులు నిర్మించడం, బరువులు వేయటం వలన ఆర్థిక లాభాలుంటాయి.

నైరుతి గది వైశాల్యము ఈశాన్యం గది వైశాల్యం కన్నా ఎక్కువగా ఉండాలి.గృహనికి నైరుతి మూలలో ఎదైన నిర్మాణము చేయలనుకుంటే పని ప్రారంభం అయిన నాటి నుండి నిర్మాణము ఆగకుండా పని జరగాలి. ఒకవేళ నిర్మాణము ఆగితే తిరిగి కట్టడం కష్టతరం అవుతుంది తోబాటు ఆర్థిక బాధలు , ప్రాణాపాయములు ఉండే అవకాశాలుంటాయి. కావున గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువులను సమకూర్చుకున్నాకనే నిర్మాణం మొదలుపెట్టాలి.

వంటగది ఆగ్నేయ దిశలోనే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. వసతిలేని సందర్భాలలో వాయవ్య గదులలో ఏర్పాటు చేసుకోవచ్చును.

ఉత్తరం వైపు హద్దు చేసి దక్షిణం దిశ వైపు ఖాళీ స్థలం వదలి నిర్మించాలకుంటే ఇల్లు పూర్తికాక పోవటమో , అనేక ఆర్ధిక కష్ట నష్టాలకు గురిచేయడమే కాకుండా ఎన్నో ఆశలతో నిర్మించుకున్న ఇంటిని అమ్ముకునే పరిస్థితి వరకు తీసుకువెలుతుంది.

గృహమునకు దక్షిణ, ప‌శ్చిమ‌, నైరుతుల‌లో ఏమైన నిర్మాణాలు చేయ‌లనుకున్నప్పుడు ప్లోరింగ్ విషయంలో మాత్రం పైక‌ప్పు లెవెల్ ఎంత మాత్రం ప‌ల్లంగా ఉండ‌కూడ‌దు,ఇది అత్యంత ముఖ్యమైన విషయం.

అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి ఇల్లు అభివృద్దికి సహకరించాలంటే తప్పక వాస్తు శాస్త్ర ప్రకారమే నిర్మాణం చేసుకోవాలి.ఇల్లు కట్టి అద్దేకు ఇచ్చినా లేదా యజమానే నివసించినా వాస్తు ఫలితం అనేది ఇంటి యజమానికి, అద్దే ఉన్నవారికి కూడా సమానంగా వర్తిస్తుంది. ఇది గమనించి స్వంత ఆలోచనలు మాని వాస్తు శాస్త్ర సూత్రాలను పాటిస్తే గృహమే స్వర్గసీమ అన్నట్టుగా ఉంటుంది.

English summary
Vastu Tips To Decide the Directions Of Your Home. Vastu for Residential House, How you will get positive results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X