ఏపీ కేజీబీవీల్లో 299 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మహిళలకు మాత్రమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV)లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 299 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
కేజీబీవీలలో భారీ ఉద్యోగాల భర్తీ
రాష్ట్రవ్యాప్తంగా 352 KGBV హాస్టల్ స్కూళ్లు నడుస్తున్న నేపథ్యంలో ఈ భారీ ఉద్యోగ అవకాశం వచ్చింది. రాత పరీక్ష లేకుండా అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు చూస్తే ప్రిన్సిపల్ పోస్టులు: 16, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs): 98, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRTs): 133, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PETs): 52 పోస్టులను భర్తీ చేయనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యాభివృద్ధికి KGBVలు
ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లోని KGBVల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఈ సంస్థల్లో పని చేయడం ద్వారా మహిళా ఉపాధ్యాయులు తమ సేవలను అందించవచ్చు. అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్, B.Ed లేదా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి, ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
దరఖాస్తు విధానం ఇలా
ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆలస్యం చేయకుండా త్వరగా అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా మంచి అవకాశం.
యువతుల్లో ఉపాధి సృష్టికి ప్రభుత్వ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమం యువతుల్లో ఉపాధి సృష్టికి దోహదపడుతుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి, అన్ని వివరాలు సరిగ్గా పూరించి దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు KGBVల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు బాలికల విద్యతో పాటు, సమగ్ర అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications