భారత్ లో రైతులపై ఎరువుల ధరల పిడుగు.. కారణం ఇదే!

ప్రపంచ రాజకీయాల్లో ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చడంతో, అమెరికా కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల మధ్యప్రాచ్యం అస్థిరతకు గురవుతోంది. ఈ యుద్ధం వాణిజ్యం, ఇంధన ధరలు, రసాయనాల సప్లై చెయిన్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీని ప్రత్యక్ష ప్రభావం భారతీయ రైతులపై పడుతోంది. ముఖ్యంగా ఎరువుల ధరలు భారీగా పెరిగి రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

యుద్ధం కారణంగా పెరిగిన ఎరువుల ముడి పదార్ధాల ధరలు

ఎరువుల ఉత్పత్తికి ముడి పదార్థాలైన నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్ మరియు నేచురల్ గ్యాస్ ధరలు ఈ యుద్ధం కారణంగా పెరిగాయి. ఇరాన్ ప్రపంచంలో ప్రధాన యూరియా ఎగుమతిదారు దేశాల్లో ఒకటి. యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి ఎగుమతులు తగ్గడం, హార్ముజ్ జలసంధి దగ్గర షిప్పింగ్ మార్గాలు అంతరాయం కలగడం వల్ల సప్లై చైన్ దెబ్బతిన్నది.

Farmers in tension Iran-Israel war is severely impacting global fertilizer supply chain costs increased

ఎరువుల దిగుమతులపై ఆధారపడిన భారత్

అమెరికా-ఇజ్రాయిల్ కూటమి ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు మరింత కఠినం చేయడంతో ఎరువుల ఉత్పత్తి మరియు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. భారతదేశం ఎరువులలో భారీగా దిగుమతులపై ఆధారపడుతుంది. గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం యూరియా ధర టన్నుకు రూ.8,000 నుంచి రూ.12,000 వరకు పెరిగింది. డీఏపీ, ఎంఓపీ వంటి కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా 25-40 శాతం వృద్ధి చెందాయి.

విపరీతంగా పెరిగిన ఎరువుల ధరలు

రైతులు ఖరీదైన ఎరువులు కొనుగోలు చేయలేకపోవడంతో పంటలు సరిగా పండకపోవడం, దిగుబడి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.పెట్రోలియం ధరలు పెరగడం కూడా ఎరువుల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. నేచురల్ గ్యాస్ ధరలు ఎగసిపడడంతో ఎరువుల ఉత్పత్తి యూనిట్ల ఖర్చు పెరిగింది. భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచినప్పటికీ, ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతోంది. రైతులు ఇప్పటికే అధిక వ్యవసాయ వ్యయంతో కష్టపడుతున్నారు.

ధరల పెరుగుదలతో రైతుల్లో ఆందోళన, ఉత్పత్తి తగ్గే ఛాన్స్

ఈ పరిస్థితి కొనసాగితే రబి సీజన్‌లో పంటల ఉత్పత్తి తగ్గి దేశవ్యాప్తంగా ఆహార ధరలు పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికే ఎరువుల కొరత, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు సహజ ఎరువుల వైపు మళ్లుతున్నారు. అయితే ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలు చేపట్టాలి. లేదంటే రైతాంగం మరింత ఆర్థిక ఇబ్బందుల్లో పడి, దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు.

ఏపీ కేజీబీవీల్లో 299 టీచర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. మహిళలకు మాత్రమే!
ఏపీ కేజీబీవీల్లో 299 టీచర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. మహిళలకు మాత్రమే!

ఎరువుల ధరల నియంత్రణకు చర్యలు అవసరం

ఈ యుద్ధం కేవలం రాజకీయ సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రైతుల ఆదాయం తగ్గకుండా, ఎరువుల ధరలను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+