vastu tips: అలవాటులో పొరబాటుగా ఈ తప్పులు చేస్తున్నారా? అయితే దరిద్రం ఇంట్లోకి నడిచొచ్చినట్టే!!
చాలామంది ఇళ్లల్లో ఒక అలవాటుగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఆ పనులు దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతాయని, ఇంట్లో ఉండే లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొస్తాయని చెబుతున్నారు. ఇక అటువంటి పనులు చేయకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే దరిద్రాన్ని తీసుకువచ్చే అనేక పనులను గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని దరిద్రానికి హేతువైన పనులను గురించి తెలుసుకుందాం.

భోజనం చేసే సమయంలో ఈ పనులు చేస్తే దరిద్రమే
చాలామంది భోజనం చేసేటప్పుడు వేళ్ళు నాకుతూ ఉంటారు, ఇక పెట్టిన భోజనం లో కొంత భాగాన్ని వదిలి పెడుతూ ఉంటారు. మరికొందరైతే శబ్దం చేస్తూ భోజనం చేస్తూ ఉంటారు. ఇంకొందరు అన్నాన్ని ముద్దలుగా చేసి నోట్లోకి విసురుతూ క్యాచ్ పట్టి తింటూ ఉంటారు. ఈ పనులు ఏమాత్రం మంచిది కాదని, ఇవి దరిద్రాన్ని తీసుకొస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పనులు చేస్తే అన్నపూర్ణాదేవి కోపం వస్తుందని, ఇంట్లో ఉండే వారికి అన్నం దొరకని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

ఈ పనులు చేస్తున్నారా? అయితే మానుకోండి
ఇక చాలామంది అదేపనిగా పళ్ళు కొరకటం, వూరికే టూత్ పిక్స్ తో పళ్ళు కుట్టుకోవడం, గోళ్ళు కోరుక్కోవడం, ఎక్కడపడితే అక్కడ అదేపనిగా ఉమ్మివేయడం చేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కనుబొమ్మలు కత్తిరించుకోవడం, ఛాతీ మీద ఉండే వెంట్రుకలను కత్తిరించుకోవడం వంటి పనులు కూడా దరిద్రాన్ని తీసుకు వస్తాయని చెబుతున్నారు. మిట్టమధ్యాహ్నం సమయంలో స్నానం చేయడం ఏ మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.

మంగళ సూత్రాల విషయంలో ఈ పనులు చెయ్యకండి
అంతేకాదు మహిళలు మంగళ సూత్రాలకు పిన్నీసులు వంటివి పెట్టడం, మంగళసూత్రాలను నారింజ, బత్తాయి వంటి పండ్ల తొక్కలు తీయడానికి ఉపయోగించడం ఏ మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. మంగళసూత్రం పవిత్రమైనదిగా గుర్తించి తదనుగుణంగా దానిని చూడాలని అంటున్నారు. కొందరు మహిళలు మంగళసూత్రం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఇక ఇటువంటి అలవాట్లను మానుకోకపోతే అవి చాలా ప్రమాదాన్ని తీసుకు వస్తాయని చెబుతున్నారు.

ఈ అలవాట్లు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు
అంతే కాదు చాలా మంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కొంతమంది టీ, కాఫీ తాగేటప్పుడు ఓ రకమైన శబ్దాన్ని చేస్తూ ఉంటారు. ఈ శబ్దాలు కూడా దరిద్రాన్ని తీసుకు వస్తాయని చెబుతున్నారు. ఇక ఇంట్లో పూజ చేసే సమయంలో కూడా కొంత మంది దీపారాధన చేయడానికి ఒకే వత్తిని వెలిగిస్తారు. అది ఏ మాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. ఇక దీపాన్ని నోటితోనే ఊది ఆర్పివేయడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇటువంటి లక్షణాలను ప్రతి ఒక్కరు తప్పకుండా మార్చుకోవాలని ఒకవేళ మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications