vastu tips: అప్పుల బాధలు మీకు తగ్గాలా? అయితే ఈ పరిహారాలు చేసి చూడండి!!

ఎంత కష్టపడినా రూపాయి మిగలడం లేదా? ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారా? కొత్త అప్పులు అవుతున్నాయా? ఎంతో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా మీ చేతికి రాకుండా పోతుందా? అయితే ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉండి ఉండవచ్చు. మనకు తెలిసీ తెలీక చేసే పనుల వల్ల ఒక్కోసారి వాస్తు దోషాలు కలుగుతాయి. ఇక అలాంటి వారు అప్పుల బాధలు తీరాలంటే ఏం చెయ్యాలి?

అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని వాస్తు పరిహారాలు చేయాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి, అప్పుల బాధలు తీరుతాయి అని చెబుతున్నారు. అంతే కాదు పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవునెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధారా స్తోత్రాన్ని చదివినా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.

emptywallet

ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్ళకద్దుకుని, అర చేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ధన నష్టం జరగకుండా ఉంటుందని చెబుతున్నారు. ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అప్పుల బాధలు తీరాలని కోరుకుని పారే నీళ్లలో కొబ్బరికాయ జారవిడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని చెబుతున్నారు.

ప్రతి బుధవారం చిన్నచిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరుతాయి అని, ఇలా ఆరు వారాలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాన్న్నినా లక్ష్మీ దేవికి నైవేద్యంగా పెడితే మంచిదని, దీనివల్ల రుణబాధలు తీరుతాయి అని చెబుతున్నారు.

ప్రతి రోజూ ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి అని, చీమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని, వ్యాపారాలు లాభసాటిగా మారతాయని చెబుతున్నారు. ఇవి అప్పుల బాధలు తీరేందుకు కొన్ని వాస్తు చిట్కాలు మాత్రమే.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+