Vastu tips: మీకు ప్రతీ విషయంలోనూ కోపం వస్తుందా? ఈ వాస్తుచిట్కాలు పాటించండి!!
చాలామందికి చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది. ప్రతి విషయానికి చిరాకు పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారి ఇళ్ళల్లో వాస్తు దోషాలు ఉండి ఉండొచ్చని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ప్రతికూల శక్తులు ఇంట్లో పెరుగుతుంటే చీటికీ మాటికీ కోపం వస్తుందని చెబుతున్నారు.
కుటుంబంలోని ఎవరికైనా చిన్న విషయానికే కోపం వస్తే అందుకు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కారణమని చెబుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చు అని, కోపాన్ని నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఇక ఆ చిన్న చిన్న వాస్తు చిట్కాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మురికి ఎక్కువగా ఉంటే కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మురికి లేకుండా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచిన తర్వాత అరచేతులను చూసుకొని మనసులో భగవంతుని ప్రార్థించి, ఆపై భూమాతకు నమస్కరించి పనులు మొదలు పెట్టాలని చెబుతున్నారు.
పొరపాటున కూడా ఆగ్నేయ దిశలో తల పెట్టి నిద్రించకూడదని, ఆగ్నేయ దిశలో తల పెట్టి నిద్రించటం వల్ల కోపం పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటికి తూర్పు దిక్కున దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి వాతావరణం ప్రశాంతంగా మారుతుందని చెబుతున్నారు.
పడక గది గోడలకు ఎప్పుడూ ముదురు రంగులు వేయకూడదని, ఒకవేళ ముదురు రంగులను వేస్తే చిరాకు కోపం పెరుగుతుందని చెబుతున్నారు. ఎప్పుడూ పడకగది గోడలకు లేత రంగులనే వాడాలని సూచిస్తున్నారు. విపరీతంగా కోపం వస్తుంటే కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిదని చెప్తున్నారు.
చంద్రుడికి ప్రతీ రాత్రి అర్ఘ్యం ఇచ్చి ఆయనను పూజించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో ఒక మూల ఒక చిన్న గిన్నెలో రాతి ఉప్పును నింపి పెట్టాలని సూచిస్తున్నారు. రాతి ఉప్పు వేసిన నీళ్ళతో తుడవడం వల్ల ఇంట్లో చిరాకు తొలగిపోయి ప్రశాంతత వస్తుందని చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications