vastu tips: దరిద్రాన్ని తీసుకువచ్చే ఈ పనులు చేస్తున్నారా? అయితే తక్షణం మానుకోండి!!

నిజ జీవితంలో మనకు తెలియకుండానే అనేక అమంగళమైన పనులు చేస్తూ ఉంటాం. వాటి ఫలితాలు మనకు తెలియక పోవడం వల్ల చాలామంది అలవాటులో పొరపాటుగా అనేక దరిద్రాన్ని తీసుకువచ్చే పనులను చేస్తూ ఉంటారు. ఇక అటువంటి వాటిని గురించి తెలుసుకొని, వాటికి దూరంగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మనకు తెలియకుండానే పొరపాటుగా సాధారణంగా చేసే దరిద్రమైన పనులు ఏంటి? హిందూ ధర్మ శాస్త్రం ఏమి చెబుతుంది? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంటికి దరిద్రం తెచ్చే పనులు ఇవే

ఇంటికి దరిద్రం తెచ్చే పనులు ఇవే

చాలామంది తమకు తెలియకుండానే బొట్టు పెట్టుకోకుండా ఉంటారు. బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తారు అయితే బొట్టు పెట్టుకోకుండా ఉండడం ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇక కొంతమంది ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తమకు తెలియకుండానే గడప మీద కూర్చుంటారు. సాధారణంగా గ్రామాల్లో ఇట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అయితే ఆ విధంగా గడప మీద కూర్చోవడం మంచిది కాదని చెబుతున్నారు. చాలామంది కనీసం జడ వేసుకోకుండా జుట్టు ముడి వేసుకొని, ఇల్లిల్లూ తిరుగుతూ పెత్తనాలు చేస్తుంటారు. ఇది కూడా ఇంటికి దరిద్రం తీసుకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తెలిసీ తెలియక ఈ పనులు చేస్తే ఇబ్బందులే

తెలిసీ తెలియక ఈ పనులు చేస్తే ఇబ్బందులే


ఇక నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకునే మహిళలు ఎంత మంది ఉన్నారు. ఇలా చేయడం తప్పని, ఇది అదృష్టాన్ని దూరం చేస్తుందని చెబుతున్నారు. చాలామంది ఎడమచేత్తో పిల్లలను కొడుతూ ఉంటారు. అలాగే ఎడమ చేతితో పిల్లలు కొట్టడం మంచిది కాదని, పిల్లలు వ్యాధిగ్రస్తులు అవుతారని చెబుతున్నారు. అలా అని కుడిచేత్తో కూడా పిల్లల్ని కొట్టడం మంచిది కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ఇక స్నానం చేసిన తర్వాత చాలా మంది ఉతికిన బట్టలు ఉండి కూడా, విడిచిన బట్టలనే కట్టుకుంటారు. అలా పదేపదే విడిచిన బట్టలను కట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

రాత్రివేళ ఈ పనులు చెయ్యకండి

రాత్రివేళ ఈ పనులు చెయ్యకండి


చాలామంది మహిళలు రాత్రి సమయాల్లో ఇల్లు ఊడుస్తూ ఉంటారు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదని, అన్నం పారేయడం శుభం కలిగించదని చెబుతున్నారు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు. రోలు, రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని చెబుతున్నారు. కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయడం, చీకటిలో భోజనం చేయడం కూడా దరిద్రాన్ని తీసుకు వస్తాయని చెబుతున్నారు.

అదృష్టం దూరం చేసే పనులివే

అదృష్టం దూరం చేసే పనులివే


చాలామంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. ఇక సహపంక్తి భోజనాలు చేస్తున్న సమయంలో అందరూ లేవకుండా మధ్యలోనే లేచి పోతూ ఉంటారు. ఇవి కూడా ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇక కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు. ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు. ఇక అన్నం తినే చేతులు నాకడం, ఒళ్లో ప్లేటు పెట్టుకొని భోజనం చేయడం అదృష్టం దూరం చేస్తాయని చెబుతున్నారు. ఇటువంటి అమంగళమైన చర్యలతో తీవ్ర నష్టం జరుగుతుందని, ఇక ఈ అలవాట్లు మార్చుకుంటే దరిద్రం నుంచి బయటపడవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+