వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: కుటుంబ కలహాలతో నరకం చూస్తున్నారా? ఈ వాస్తుటిప్స్ పాటిస్తే ఘర్షణలకు చెక్!!

|
Google Oneindia TeluguNews

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టు, చాలామంది బ్రతకడానికి కావలసిన డబ్బు, ఇల్లు అన్నీ ఉన్నా నిత్యం ఇంట్లో అశాంతితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిరోజు అనుకోని ఘర్షణలు ఇంట్లో చోటు చేసుకొని మనశ్శాంతిని పోగొట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక అటువంటి వారు చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే ఘర్షణలకు చెక్ పెట్టొచ్చని, సుఖశాంతులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఘర్షణలను తగ్గించటానికి వాస్తు చిట్కాలు

ఇంట్లో ఘర్షణలను తగ్గించటానికి వాస్తు చిట్కాలు

కుటుంబంలో తగాదాలు మరియు వాదనలు చాలా సాధారణం, కానీ అవి మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తే అటువంటి ఘర్షణలు మంచివి కావని గుర్తించాలి. ఈ తగాదాలకు అనేక కారణాలు ఉండవచ్చు, కానీ కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవడానికి వాటిని ముగించడం చాలా అవసరం. ఈ తగాదాలు రోజూ జరగడానికి అనేక కారణాలున్నాయని, వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి తగాదాలు తగ్గించడానికి లేదా తొలగించడానికి కొన్ని నివారణలు ఉన్నాయని సూచించబడింది. ఇక వాటి వివరాలను చూస్తే

 తెల్ల చెందనం విగ్రహంతో ఉద్రిక్తతలకు చెక్

తెల్ల చెందనం విగ్రహంతో ఉద్రిక్తతలకు చెక్

ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు వివాదాల భరితంగా ఉంటే, తెల్లటి చందనం చెక్కతో తయారుచేసిన ఏదైనా దేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచండి. ఇది ఉద్రిక్తతను తగ్గిస్తుంది, సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచుతుంది. తెల్ల చందనం చెక్క ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించి, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

నెగిటివ్ శక్తులకు చెక్ పెట్టి ఇంట్లో ప్రశాంతతకు ఉప్పు..

నెగిటివ్ శక్తులకు చెక్ పెట్టి ఇంట్లో ప్రశాంతతకు ఉప్పు..

అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం, ఉప్పు అన్ని ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు. ఇంట్లోని గదులలో మూలలో, రాతి ఉప్పును ఉంచండి. ఉప్పును గది మూలలలో నెల నెల రోజుల పాటు ఉంచండి. ఒక నెల తర్వాత దాన్ని తీసివేసి, దాని స్థానంలో కొత్త రాతి ఉప్పు మళ్లీ పెట్టండి. ఇది కుటుంబానికి శాంతిని కలిగిస్తుంది మరియు కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఇది వాస్తు దోషాలను, మరే ఇతర నెగిటివ్ ఎనర్జీలను అన్నిటినీ తగ్గిస్తుంది.

అంతా కలిసి భోజనం వంటగదిలో చెయ్యటం

అంతా కలిసి భోజనం వంటగదిలో చెయ్యటం

ఇక మూడవ చిట్కా లో సమిష్టి మరియు ఐక్యత యొక్క భావాన్ని పెంపొందించడానికి మీ కుటుంబంతో కలిసి భోజనం చేయండి. అలాగే, వీలైతే, మీ ఇంటి వంటగదిలో తినడానికి ప్రయత్నించండి. వంటగది తగినంత పెద్దగా ఉంటే వంటగదిలో భోజనం చేయడమే శ్రేయస్కరం. ఇది రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది.

బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రశాంతత

బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రశాంతత

ఇక ఇంట్లో బుద్ధ భగవానుడు విగ్రహం శాంతిని సామరస్యాన్ని సూచిస్తుంది. బుద్ధుడి విగ్రహాన్ని ఇళ్లల్లో పెట్టుకోవడం వల్ల పిల్లల్లో ఘర్షణలు తగ్గుతాయి. మీ ఇంట్లో ఎంత స్థలం ఉందో దాన్ని బట్టి మీరు బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. మీరు బుద్ధుడి విగ్రహాలను మీ బాల్కనీలో లేదా మీ గదిలో పెట్టుకోవచ్చు. నిత్య ఘర్షణలు పడేవారు ఇంట్లో బుద్ధుడి విగ్రహాలను పెట్టుకోవడం వల్ల కాస్త గొడవలు నుండి బయటకు వస్తారు. బుద్ధుడి విగ్రహం ఇళ్లలోని వారికి ప్రశాంతతను అందిస్తుంది.

ఈ రంగు బట్టలు ధరిస్తే ఆడవారి మధ్య కలహాలు

ఈ రంగు బట్టలు ధరిస్తే ఆడవారి మధ్య కలహాలు

ఇక ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూ ఉంటే కుటుంబంలోని వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానుకోవాలని సూచించబడింది. కుటుంబంలోని మహిళల మధ్య టెన్షన్ మరియు అసమ్మతి ఉంటే, వారు ఒకే సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. సందర్భం ఏదైనా సరే వారు ఎరుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండడమే మంచిదని సూచించబడింది.

మగవారి మధ్య మనస్పర్ధలు దూరం కావాలంటే చెయ్యాల్సింది ఇదే

మగవారి మధ్య మనస్పర్ధలు దూరం కావాలంటే చెయ్యాల్సింది ఇదే

ఇక ఇంట్లో ఉండే మగ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే, ఇంట్లో కదంబ చెట్టు యొక్క చిన్న కొమ్మను ఉంచడం ఒక సులభమైన పరిష్కారం ఈ వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కదంబ చెట్టును దేవతా వృక్షం గా భావిస్తారు. ఇది ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి సహాయపడుతుంది. ఇక ఈ చెట్టు కొమ్మ ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉండే మగ వారి మధ్య గొడవలు సద్దు మణుగుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో పాటు, కాస్త సమయం కూడా పాటిస్తూ, సహనంతో సమస్యలను పరిష్కరించుకుంటూ ఇంట్లో ఉండే గొడవలు దూరం చేసుకొని సంతోషంగా జీవించాలని సూచించబడింది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Fights and arguments in the family? Vastu Shastra experts say that if these Vastu tips are followed, conflicts will be reduced and peaceful life will be yours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X