Vastu tips: ఆర్ధిక ఇబ్బందులా? ఆరోగ్య సమస్యలా? చిన్న బెల్లంముక్కతో మాయం.. ఎలాగంటే!!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించడమే కాదు, ఇంట్లో ఉండే వస్తువులు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు నియమాలను పాటిస్తూ పెట్టుకోవాలని ఇప్పటికే వాస్తుశాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో ఇంట్లో కొన్ని ఆహార పదార్థాల విషయంలో కూడా వాస్తు శాస్త్ర నిపుణులు ముఖ్యమైన సూచనలు చేశారు. ఇంట్లో బెల్లం ఉంచుకోవడం మంచి ఫలితాలకు సంకేతమని, శుభసూచకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

బెల్లంతో ఆరోగ్యమే కాదు అదృష్టం కూడా

బెల్లంతో ఆరోగ్యమే కాదు అదృష్టం కూడా

బెల్లాన్ని ఆహారంలో రుచిని పెంచే పదార్థంగా మాత్రమే కాకుండా, ఆరోగ్యప్రదాయినిగానూ చూస్తారు. బెల్లం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం ఇమ్యూనిటీ పెంచి అనేక శ్వాస సంబంధిత వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఈ రెండు ప్రయోజనాలే కాకుండా బెల్లంతో అదృష్టం కూడా కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో ఎప్పుడూ బెల్లం ఉంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

 వంటగదిలోబెల్లం ఉంచటం వల్ల అదృష్టం

వంటగదిలోబెల్లం ఉంచటం వల్ల అదృష్టం

వంట గదిలో ఎన్ని సామాన్లున్నా, బెల్లం తప్పనిసరిగా ఉంచుకునేలా చూడండి. వంటగదిలో బెల్లం ఉంచడం వల్ల అది మనకు అదృష్టం కలిగిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో బెల్లాన్ని ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చని సూచిస్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు బెల్లం ద్వారా ఒక చిన్న చిట్కాను అనుసరిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు అని సలహా ఇస్తున్నారు.

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవారు బెల్లంతో ఈ పని చెయ్యండి

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవారు బెల్లంతో ఈ పని చెయ్యండి

తీవ్రమైన డబ్బుల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఒక ఎర్రని వస్త్రంలో చిన్న బెల్లం ముక్క పెట్టి, కొన్ని డబ్బుల నాణాలను వేసి దానిని మూటకట్టి లక్ష్మీదేవి విగ్రహం ముందు గాని, చిత్రపటం ముందు గాని ఐదు రోజులపాటు ఉంచాలని సలహా ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మూట కట్టిన బెల్లాన్ని, డబ్బుల నాణేలను ఇంట్లో డబ్బు ఉంచుకునే చోట, బీరువాలో ఐదు రోజుల పాటు పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి, కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయని, ఇంట్లో ధనలక్ష్మి వచ్చి కూర్చుంటుంది అని చెబుతున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్నవారు బెల్లంతో ఇలా చెయ్యండి

అనారోగ్యంతో బాధపడుతున్నవారు బెల్లంతో ఇలా చెయ్యండి

ఇక అంతే కాదు విపరీతమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు బెల్లం ద్వారా అనారోగ్య బాధల నుండి బయటపడవచ్చని సూచిస్తున్నారు. పంచదారకు బదులు వారు ఆహారంలో బెల్లాన్ని ఉపయోగించడంతో పాటుగా, బెల్లాన్ని ఐదుగురికి కానీ, తొమ్మిది మందికి కానీ దానం చేయడం వల్ల అనారోగ్య బాధల నుండి బయట పడతారు అని సూచిస్తున్నారు. బెల్లాన్ని దానం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం వారికి కలుగుతుందని, తద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

కోరికలు తీరాలంటే బెల్లంతో చెయ్యాల్సింది ఇదే

కోరికలు తీరాలంటే బెల్లంతో చెయ్యాల్సింది ఇదే

అంతేకాదు ఏదైనా కోరిక తీరాలంటే కూడా బెల్లాన్ని మూటకట్టి, గట్టిగా సంకల్పిస్తే జరుగుతుందని చెబుతున్నారు. ఏడు బెల్లం ముక్కలు, ఒక రూపాయి నాణెం, ఏడు పసుపు కొమ్ములను ఒక పసుపు గుడ్డలో కట్టి మనసులో అనుకున్న లక్ష్యాన్ని సంకల్పించుకుని ఎవరూ తొక్కని చోట దూరంగా పడేయడం కానీ, లేదా నీళ్లలో వేయడం కానీ చేయాలని చెబుతున్నారు. ఇలా చేస్తే కచ్చితంగా మనసులో అనుకున్న కోరిక తీరుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+