vastu tips: ఇల్లు ఎలా ఉంటే లక్ష్మీదేవి సంతోషంగా వస్తుందో తెలుసుకోండి!!
ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడ బూజు, దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది.

లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇలా చెయ్యకండి
అంతేకాదు వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. కాబట్టి ఎప్పుడు తిన్న కంచాలైన, గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దెక్కే వరకు నిద్ర పోవడం మంచిది కాదని, ఇక సాయంత్ర సమయంలో నిద్రపోవడం కూడా చేయకూడదని చెబుతున్నారు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదని అంటున్నారు.

ప్రతీరోజూ ఈ పనులు చెయ్యండి .. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది
ఇక ఏ ఇంట్లో అయితే నిత్యదీపారాధన చెయ్యరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని చెబుతున్నారు. ప్రతి రోజూ ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుందని, కుటుంబ సభ్యులకి చిరాకు పోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు.

లక్ష్మీ దేవికి ఇష్టమైన పనులు చేస్తే సకల శుభాలు.. ఆమె అనుగ్రహం
ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకుని నీటిని చల్లి, ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు, రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు. గడపలకు పసుపు, కుంకుమలతో పూజించిన ఇళ్ళలో కూడా లక్ష్మీ దేవి తాండవిస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు పెడితే లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుంది అని, ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా, నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెబుతున్నారు.

లక్ష్మీ అనుగ్రహం ఉంటే మనశ్శాంతి వచ్చి తీరుతుంది
ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు రోదిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని, అందుకే ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోదించడం మంచిదికాదని చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడైతే కళకళలాడుతూ సంతోషంగా ఇంట్లో తిరుగుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని వారికి అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీ అనుగ్రహం ఉన్న ఇంట్లో, మనశ్శాంతికి కూడా కొదవ ఉండదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!












Click it and Unblock the Notifications