Vastu tips: ఇంట్లో ఈ సమస్యలు ఉంటే వాస్తుదోషం ఉన్నట్టే; ఒకసారి చెక్ చేసుకోండి!!
మనం ఇళ్లను వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని తెలుసుకున్నాం. ఇంట్లో పెట్టే వస్తువులను సైతం వాస్తు ప్రకారం అమర్చుకోవాలని, సంతోషంగా జీవించటం కోసం వాస్తు నియమాలను పాటించాలని చెప్పుకున్నాం. కానీ మనం నివసించే ఇంట్లో వాస్తు సక్రమంగా ఉందా? వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవటం అందరికీ కష్టం. ఇక వాస్తు దోషాలను తెలుసుకోవడానికి కూడా కొన్ని సంకేతాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన వాస్తు దోష సంకేతాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఇంట్లో వాస్తు దోషాలు ...సంకేతాలివే
ఏ ఇంట్లో అయినా వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో ప్రధానంగా ఈ సమస్యలు ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు చీటికిమాటికి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అంటే ఆ ఇంట్లో కచ్చితంగా వాస్తు దోషం ఉన్నట్టే లెక్క అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రశాంతంగా ఉన్న ఇంట్లో చిన్న చిన్న విషయాలకు కుటుంబసభ్యుల మధ్య కలహాలు రావడం వంటి సమస్యలు కూడా వాస్తు దోషం వల్ల చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఆర్థికంగా విపరీతమైన సమస్యలు రావడం, ప్రతి చిన్న విషయానికి మానసికంగా ఆందోళన కలగటం కూడా వాస్తు దోషం కారణంగానే అని చెబుతున్నారు.

ఏ పని చేసినా కలసిరావటం లేదా? అన్నీ సమస్యలేనా? అయితే వాస్తు దోషమే
ఏ పని చేసినా కలిసి రాకపోవడం విపరీతంగా అప్పులు చేయడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, భార్యాభర్తలు విడిపోవడం సంతానం కలగకపోవడం, తరచూ ఇతరులతో గొడవ పడటం, ఏ పని చేసిన ఎక్కడికి వెళ్ళినా అనేకమైన సమస్యలు ఎదురు కావడం వాస్తు దోషం వల్లనే అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఇంట్లో అన్ని ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా బ్రతకలేకపోవడానికి వాస్తు దోషమే ప్రధాన కారణమని చెబుతున్నారు.

కుటుంబ కలహాలు, పిల్లలలో వ్యసనాలు .. అన్నీ వాస్తు దోషం వల్లే
కుటుంబాలలో పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, చదువులలో రాణించక పోవడం, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోవడం, వ్యసనాల బారిన పడటం, కేసులలో ఇరుక్కోవడం కూడా వాస్తు దోషం వల్లేనని అంటున్నారు. ఈ సమస్యలు ఎవరి ఇంట్లోనైనా ఉంటే, కచ్చితంగా ఒక్కసారి ఇంటి వాస్తును, వాస్తు శాస్త్ర సిద్ధాంతి చే తనిఖీ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. చాలా మంది ఇల్లు వాస్తు ప్రకారమే ఉందని, వాస్తు దోషం ఏమీ లేకున్నా ఇబ్బందులు పడుతున్నామని భావిస్తూ ఉంటారు. కానీ కచ్చితంగా ఇంట్లో కష్టాలు వాస్తు దోషాలు లేకుండా ఊరికనే రావని అంటున్నారు.

వాస్తు దోషాల నివారణకు అనేక చిట్కాలు..
వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్న వాస్తు శాస్త్ర నిపుణులు, వాస్తు దోషాల నివారణకు అనేక చిట్కాలు ఉన్నాయని, వాటిని పాటించడానికి అసలు ఎక్కడ వాస్తు దోషం ఉందో తనిఖీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయడంతో పాటు, ప్రశాంతమైన ఇంటి వాతావరణం కోసం చిన్నచిన్న వాస్తు చిట్కాలను పాటించాలి అని సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications