Vastu tips: స్త్రీలు ఈ పనులు చేస్తే ఇంట్లో దరిద్రమే.. అర్జెంట్ గా మానుకోండి!!

పురుషులు చేయకూడని పనులు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా స్త్రీలు చేయకూడని పనులు కూడా అనేకం ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. మహిళలు తాము చేసిన పనులలో ఏవి చెయ్యొచ్చు ? ఏవి చెయ్యకూడనివి? అనేవి తెలుసుకోవటం చాలా ముఖ్యం. వివాహితలు అయిన స్త్రీలు ఇంట్లో చేయకూడని పనుల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితులలోనూ రాత్రిసమయంలో గాజులు,కమ్మలు, మంగళ సూత్రాలు తియ్యకూడదు. వీరు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు.

స్త్రీలు ఇంట్లో చెయ్యకూడని పనులివే

స్త్రీలు ఇంట్లో చెయ్యకూడని పనులివే

మంగళవారం నాడు భర్త పిల్లలు ఎవరు క్షవరం కానీ, గడ్డం కానీ చేసుకోవడం మంచిది కాదని చెప్పి నిలువరించాలి. అలా చేస్తే దరిద్రం వస్తుందన్న విషయాన్ని స్త్రీలు చెప్పాలి. ఇక ఇంట్లో చేసే మంచి పనులను శుక్లపక్షం లోనే చెయ్యాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు వచ్చే రోజులలోనే మంచి పనులు చేయాలి. స్త్రీలు పొరపాటున వారు కానీ, పిల్లలు కానీ దిండు పై కూర్చోకూడదు. నలుపు రంగు వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. స్త్రీలు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు.

 స్త్రీలు దరిద్రం ఇంట్లోకి వచ్చే ఈ పనులు చెయ్యకండి

స్త్రీలు దరిద్రం ఇంట్లోకి వచ్చే ఈ పనులు చెయ్యకండి


స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జేష్టాదేవి వచ్చి కూర్చుంటుంది. శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన రోజు కానీ ఆ డబ్బులతో మొదటిసారి ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంతేకాదు స్త్రీలు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్లు ఊపుతూ కూర్చోవడం, స్థిరంగా నిలబడకుండా డాన్స్ చేస్తున్నట్లు గా తిరుగుతూ ఉండటం వంటి పనులు చేయకూడదు. పెళ్లైన స్త్రీలు రాత్రివేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు.

స్త్రీలు ఈ మాటలు మాట్లాడటం మానుకోవాలి

స్త్రీలు ఈ మాటలు మాట్లాడటం మానుకోవాలి


స్త్రీలు బహిస్టు సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పూలు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దు అని చెప్పకుండా, రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది. మంగళ, శుక్రవారాల్లో కాకుండా ఇంటిని బూజు, దుమ్ము లేకుండా స్త్రీలు దులుపుకొని సర్ది పెట్టుకోవాలి. ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం, శని, పీడ, పీనుగ వంటి పదాలను పలకరాదు. మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు. మహిళలు ఎప్పుడు ఎవరికైనా తాంబూలం గా కొబ్బరిచిప్పలు ఇచ్చేటప్పుడు, కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి.

 బాధలో ఉన్న సమయంలో స్తీలు ఈ జాగ్రత్తలు పాటించాలి

బాధలో ఉన్న సమయంలో స్తీలు ఈ జాగ్రత్తలు పాటించాలి


ఎవరైనా బాధలో ఉన్నప్పుడు పలకరించడానికి వస్తే వారిని ఆహ్వానించకూడదు. ఇక బాధలో ఉన్న కుటుంబాన్ని విచారించి అక్కడి నుంచి వెళ్లే స్త్రీలు వెళ్లి వస్తానని కూడా చెప్పకూడదు. పెళ్లైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు. ఇలా మహిళలు చెయ్యకూడని విషయాలను తెలుసుకొని, తదనుగుణంగా వాటిని చేయకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+