Vastu tips: ఇంటికెళితే చిరాకులా.. అన్నీ సమస్యలా.. బయటపడేందుకు చెయ్యాల్సిందిదే!!

ఇంటిని నిర్మించుకోవడానికి వాస్తు నియమాలు ఏ విధంగా అవసరమో .. అదేవిధంగా ఇంట్లో జీవించడానికి వాస్తు దోషాలు లేకుండా ఉండడం కూడా అంతే అవసరం. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో నివసించే మనుషులు మనసు ఎప్పుడు చిరాకుగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇంట్లోకి వస్తే ఎప్పుడూ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రకరకాల టెన్షన్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక సంపాదించింది మొత్తం ఖర్చవుతుంది. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ఇంట్లో బృహస్పతి బలహీనంగా ఉంటే తరచూ చిరాకులు.. ఈ పని చెయ్యండి

ఇంట్లో బృహస్పతి బలహీనంగా ఉంటే తరచూ చిరాకులు.. ఈ పని చెయ్యండి


ఇంటి బయట ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపించి, ఇంటికి వచ్చిన తర్వాత చిరాకు కలుగుతున్న వారు ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని, ఇంట్లో బృహస్పతి బలహీనంగా ఉన్నాడని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అటువంటివారు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం కోసం చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఇంట్లో ఎప్పుడు ప్రతికూల ప్రభావం ఉన్నట్టుగా అనిపించినా ముందుగా ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో కచ్చితంగా రోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి పూజ నిర్వహించాలి.

సానుకూలత కోసం ఈ పని చెయ్యండి

సానుకూలత కోసం ఈ పని చెయ్యండి


ఇల్లంతా అగర్బత్తిలతో ధూపం వేయాలి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి సానుకూలతను తీసుకురావాలి. విష్ణు సహస్రనామాలు వినడం, గాయత్రి మంత్రం వినడం వంటివి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ని బయటకు పంపించడంలో ఉపయోగపడతాయి. అంతేకాదు ఇంట్లో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లోని వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లోని వ్యక్తులు అనారోగ్యంతో ఉంటే సంపాదించిన సంపాదనలో ఎక్కువ ఆదాయం మందులకే ఖర్చవుతుంది.

సూర్యుడు బలహీనంగా ఉంటే అన్నీ రోగాలే .. ఈ పనులు చెయ్యండి

సూర్యుడు బలహీనంగా ఉంటే అన్నీ రోగాలే .. ఈ పనులు చెయ్యండి

ఎటువంటి ఇబ్బందులు లేకున్నా తరచూ అనారోగ్యం వాడిన పడుతున్నారు అంటే వారి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్టే గుర్తించాలి. ఇక జాతకంలో సూర్యుడిని బలంగా మార్చటానికి, సూర్యుడు బలంగా లేకపోవడం వల్ల వచ్చే ప్రతికూలతలను తొలగించడానికి ప్రతిరోజు ఇంట్లో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. గాయత్రి మంత్రి జపం ఇంట్లో ప్రతిధ్వనించాలి. ఇక రెండు పూటలా వండిన తర్వాత ఆహారాన్ని భగవంతుడికి నివేదించాలి . దీంతో ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

కుజుడు బలహీనంగా ఉంటే ఇంట్లో గొడవలు .. చెయ్యాల్సింది ఇదే

కుజుడు బలహీనంగా ఉంటే ఇంట్లో గొడవలు .. చెయ్యాల్సింది ఇదే

ఇంట్లో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు వస్తుంటే, కుటుంబ సభ్యుల మధ్య తరచూ విభేదాలు పెరిగిపోతూ ఉంటే కుజుడు స్థానం మంచిగా లేదని అర్థం చేసుకోవాలి. ఇక కుజుడు ప్రభావం నుంచి బయటపడడం కోసం ఇంట్లో సూర్యకాంతి బాగా పడేలా, గాలి, వెలుతురు ధారళంగా వచ్చేలా ఉండాలి. అంతేకాదు రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం హనుమాన్ చాలీసాను చదువుకోవడం వల్ల కూడా ఇంట్లో కొంతమేరకు గొడవలు తగ్గుతాయి. ఇదే సమయంలో ఇంట్లో ఎరుపు రంగు వస్తువులను వినియోగించడం మానుకోవాలి.

రాహువు ప్రభావం ఉంటే ఇంట్లో ఈ ఇబ్బందులు .. చెయ్యాల్సింది ఇదే

రాహువు ప్రభావం ఉంటే ఇంట్లో ఈ ఇబ్బందులు .. చెయ్యాల్సింది ఇదే


ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పదేపదే పాడైపోతున్న, బల్బులు, ట్యూబ్ లైట్లు పదేపదే కాలిపోతున్న ఆ ఇంట్లో రాహువు ప్రభావం ఉందనే విషయాన్ని గుర్తించాలి. రాహువు అశుభాలను చేకూరుస్తాడని తెలుసుకోవాలి. రాహువు ప్రభావం వల్ల ఇంట్లో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని చెబుతారు. ఇక రాహువు ప్రభావం నుంచి బయటపడటం కోసం ఇంట్లో ప్రధాన ప్రదేశాలలో ఎరుపు రంగు స్వస్తిక్ గుర్తును ఉంచడం వల్ల రాహువు ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇంట్లో చెత్తాచెదారం లేకుండా, మురికి పేరుకు పోకుండా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.

disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సలహాలు, నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+