• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: డబ్బులు, నీళ్ళ విషయంలో దోషాలుంటే ధనం నిలవదు.. ఈ దోషాలుంటే సరిచేసుకోండి!!

|
Google Oneindia TeluguNews

వాస్తు ప్రశాంతంగా జీవించడానికి ఒక మార్గం. ఇది వాతావరణంలోని సానుకూల, ప్రతికూల శక్తుల ద్వారా మన జీవితం పై ప్రభావం చూపిస్తుంది. ఇంటికి చక్కని వాస్తు ఉండి, ఇంట్లో వస్తువులు కూడా వాస్తు ప్రకారం నుండి, కుటుంబ సభ్యులందరూ వాస్తు నియమాలను పాటిస్తే ఆ ఇంటి పై సానుకూల శక్తి ప్రభావం ఉంటుందని చెబుతారు. అలా కాకుండా వాస్తు నియమాలు పాటించకుండా, ఎక్కడ ఏ వస్తువు పెడుతున్నామో తెలియకుండా ప్రవర్తిస్తే వాస్తు దోషాలు చోటు చేసుకొని తీవ్ర ఇబ్బందులు పాలవుతారని వాస్తు శాస్త్రం వెల్లడించింది.

 డబ్బులు ఆ దిశలో పెడితే మంచిది కాదు

డబ్బులు ఆ దిశలో పెడితే మంచిది కాదు

చాలా మంది ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవడం లేదని, అనుకోని ఖర్చులు వచ్చి ఖర్చయిపోతున్నాయని బాధపడుతూ ఉంటారు. కష్టానికి తగిన ఫలితం లేదని, తాము అభివృద్ధి చెందడం లేదని దిగులు పడుతూ ఉంటారు. అయితే అటువంటి వారి ఇళ్లలో డబ్బు పెట్టే చోటుపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో ఉన్న గోడకు ఏర్పాటుచేసిన అల్మారాలో డబ్బులు పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు. అలా డబ్బులు పెడితే అల్మరా డోర్ ఓపెన్ చేసినప్పుడు అది దక్షిణం వైపు తెరుచుకుంటుంది అని, దక్షిణం వైపుకు చూసేలా డబ్బులు పెడితే ఖచ్చితంగా ధన నష్టం జరుగుతుందని చెబుతున్నారు.

ఆ దిక్కులలో డబ్బులు పెడితే ధనలక్ష్మి కటాక్షం

ఆ దిక్కులలో డబ్బులు పెడితే ధనలక్ష్మి కటాక్షం

ఇక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు కు ఉండేలా అల్మరా ఏర్పాటు చేసి అందులో డబ్బులు పెడితే కలిసి వస్తుందని చెబుతున్నారు. ఉత్తరం దిక్కు కుబేరుడు స్థానం కాబట్టి, ఆ దిక్కు వైపు డబ్బులు ఉండేలా పెడితే ధన వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. అంతేకాదు పడమర దిశ లోని గోడకున్న అల్మరాలో పెడితే, డోర్ ఓపెన్ చేసినప్పుడు డబ్బు తూర్పు దిశ వైపు ఉంటే కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు.

తూర్పు అభిముఖంగా ఉండడంవల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని కాబట్టి డబ్బులు పెట్టే విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, తూర్పు అభిముఖంగా డబ్బులు పెడితే డబ్బులకు ఎప్పుడూ కొదవ ఉండదని చెబుతున్నారు.

ఇంటిపై కప్పు చెత్తతో ఉంటే ఆర్ధిక కష్టాలు

ఇంటిపై కప్పు చెత్తతో ఉంటే ఆర్ధిక కష్టాలు

అంతేకాదు ఇంటి పై కప్పు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని, పై కప్పు పైన చెత్తాచెదారం జమ చేస్తే యజమాని ఆర్థిక ఇబ్బందులను, ఒత్తిడులను ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఇంటి పై కప్పు పైన చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకుంటే మంచి జరుగుతుందని సూచిస్తున్నారు. ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉండాలంటే ఇంట్లో నీళ్ల సంబంధ విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఇంట్లోనే లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కుళాయిలు లీక్ అయినా దాని ప్రభావం కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిపై పడుతుందనే విషయాన్ని గుర్తించాలి.

నీళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే ధన నష్టం

నీళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే ధన నష్టం

ఇక నీళ్ళకు సంబంధించిన పాత్రలను ఎప్పుడూ ఉత్తర దిశలోనే ఉంచడం ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోంది. నీటి పాత్రలను ఎప్పుడూ దక్షిణ మరియు పడమర దిశల్లో ఉంచకూడదని గుర్తించాలి. అలా ఉంచితే కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురవుతారని మానసిక వత్తిడి విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఆర్థిక సంబంధమైన సమస్యలు లేకుండా ఉండాలంటే వాస్తు దోషాలు పైన కూడా దృష్టి సారించాలని, అవి లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం

డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం

మనం చేసే చిన్న పనులే కానీ, అవి వాస్తు నియమాలకు భంగం కలిగించేలా ఉంటే ఫలితం ఎప్పుడూ ప్రతికూలంగా ఉంటుందని, అలా ప్రతికూలంగా కాకుండా, సానుకూల ఫలితం వచ్చేలా తగిన విధంగా వాస్తు చిట్కాలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Vastu Shastra experts say that if there are vastu defects in the direction of money and water in the house, money will not stay at home.. Such vastu defects should be identified and corrected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X