Vastu tips: కిచెన్ ఇలా ఉంటే అశుభం; వంటగదిలో ఉంచకూడని వస్తువులు ఇవే!!
ఇంటి నిర్మాణం సరైన వాస్తు నియమాలతో చేస్తే ఆ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయి. ఇంటి నిర్మాణంలో ముఖ్యమైన వంటగది విషయంలో కూడా వాస్తు శాస్త్ర నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యులు అభివృద్ధి దెబ్బతింటుందని, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంటగది విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు.

వంటగదికి వాస్తు శాస్త్రంలో ప్రాధాన్యత
వంటగదిని తల్లి అన్నపూర్ణాదేవి నివాసముండే స్థలంగా అందరూ భావిస్తారు. వంటగదిలోనే మహిళలు ఎక్కువ సమయం గడుపుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ భాగంలో ఉంటుంది. ఇక వంట గదిలో ఎప్పటికీ ఉండవలసిన నాలుగు పదార్థాలు ఉప్పు, పసుపు, బియ్యం, గోధుమ పిండి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎప్పుడూ ఖాళీ చేయొద్దని సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో వంట గదిలో ఉండకూడని వస్తువులను గురించి కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.

వంట గదిలో పెట్టకూడని వస్తువులు ఇవే
వంట గదిలో మన ఆహారం తయారు చేసి తింటాం కాబట్టి.. ఎప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచాలి. వంట గదిలో చీపుర్లు పెట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చీపుర్లు, చెత్త డబ్బాలు మురికికి సంబంధించిన వస్తువులు కాబట్టి, తినే ఆహార పదార్థాలు ఉండే వంటగదిలో వీటిని పెట్టడం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు అని చెబుతున్నారు. వంటగదిలో వాషింగ్ మెషీన్ పెట్టకూడదని చెప్తున్నారు. అంతేకాదు వంట గదిలో పని చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి చేతులు తెగి గాయాలు కావడం, కాలిన గాయాలు కావడం సంభవిస్తుంది. ఈ కారణంగా చాలామంది ప్రథమ చికిత్స చేసే కిట్ ను వంట గదిలో పెడతారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వంటగదిలో ఈ వస్తువులు పెడితే ఆరోగ్యంపై చెడు ప్రభావం
వంటగదిలో మందులను ఉంచడం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయని సూచిస్తున్నారు. కొన్ని చిన్న ఆనారోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి. అందువల్ల, వంటగదిలో మందుల పెట్టెలను ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. లేకుంటే, ఇంట్లోని ప్రజల ఆరోగ్యంపై దాని ప్రభావం చాలా చెడుగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అంతే కాదు ఆహారం వండేటప్పుడు బయట వ్యక్తులకు కనిపించకూడదని సూచిస్తున్నారు.

వంటగదిలో చెత్తా చెదారం ఉంటే అశుభం
వంట గదిలో దేవుని గది ఉండకూడదని, వంట గదిలో పూజామందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు. వంట గదికి ఆనుకుని టాయిలెట్లు ఉండకూడదని సూచిస్తున్నారు. వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తా చెదారంతో వంటగదిని నింపకూడదని చెబుతున్నారు. అలా వంటగది ఉంటే అశుభం అని చెప్తున్నారు. ఏదేమైనా వంటగది శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, వాస్తు శాస్త్ర నిపుణులు సూచించిన నియమాలను పాటిస్తే, గదిలో ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు అనేవి తెలుసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందని, ఎలాంటి అనారోగ్య బాధలు లేకుండా కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications