vastu tips: దరిద్రం పోవాలంటే, ధనలక్ష్మి ఇంటికి రావాలంటే చెయ్యాల్సిన పనులు ఇవే!!
ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని, లక్ష్మీ అనుగ్రహం కలగడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు లక్ష్మీ కటాక్షం కలగడానికి అనేక సూచనలు చేస్తున్నారు. లక్ష్మీకటాక్షం కలగాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని, సమయానుకూలంగా పనిచేయాలని వారు చెబుతున్నారు. ఇక ఆ విషయాలలోకి వెళితే

ఉదయాన్నే లేచి ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం
లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముఖ్యంగా ఇళ్లల్లోని మహిళలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ఇంటిముందు ఊడ్చి, శుభ్రపరిచి ముగ్గు వేసి, ఇంట్లో పూజ నిర్వహించాలని, అప్పుడు అటువంటి ఇళ్లలోని వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. మహిళలు ఉదయాన్నే నిద్ర లేకపోవడం, ఇల్లు శుభ్రం చేసుకోకపోవడం దరిద్రానికి ప్రధాన కారణమని, అటువంటి ఇళ్ళల్లో లక్ష్మీ కటాక్షం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

బూజు పట్టిన ఇల్లు దరిద్రానికి హేతువు.. ఇలా ఉంటేనే లక్ష్మీ ఆగమనం
అంతేకాదు బూజుపట్టిన ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుందని, ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. బూజుపట్టిన ఇళ్లల్లోకి లక్ష్మీదేవి రాదని, అటువంటి ఇళ్లల్లో ఉన్నవారు కూడా లక్ష్మీ కటాక్షం నీకు నోచుకోరని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉండాలని, ఇంట్లో ఇల్లాలు కూడా శుభ్రంగా ఉండాలి అని సూచిస్తున్నారు.

చిరిగిన వస్త్రాలు, మాసిపోయిన బట్టలు వేసుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం
ఇక ఎవరైతే ఇళ్లల్లో చిరిగిన వస్త్రాలను ధరిస్తారో అటువంటి వారి ఇళ్ళల్లో లక్ష్మీదేవి నివసించడానికి చెబుతున్నారు. చిరిగిన వస్త్రాలు దరిద్రానికి హేతువని చెబుతున్నారు. అలాగే మాసిపోయిన బట్టలను పదే పదే ధరించటం కూడా లక్ష్మీదేవికి చిరాకు కలిగిస్తుందని, అటువంటివారి ఇంటికి ఎంత కష్టపడినా లక్ష్మీ రాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు . ఏరోజుకారోజు ఉతికిన శుభ్రంగా ఉన్న వస్త్రాలను ధరించాలని సూచిస్తున్నారు.

తెగిన చెప్పులు, ఇతరులు వాడిన చెప్పులు వాడితే దరిద్రమే
తెగిన చెప్పులను వాడడం దరిద్రానికి హేతువని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తెగిన చెప్పులను కుట్టించుకొని వాడడం, తెగిన చెప్పులను ఇంట్లోనే పెట్టుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. తెగిన చెప్పులను కుట్టించుకుని వాడే వారి ఇంటికి లక్ష్మీ దేవి రాదని నిపుణులు చెబుతున్నారు. ఇక తెగిపోయిన చెప్పులను ఊరి బయట విడిచి వస్తే దరిద్రం పోతుందని చెప్తున్నారు . అంతేకాదు ఇతరుల చెప్పులు వాడటం కూడా మంచిది కాదని, అవి కూడా దరిద్రాన్ని తీసుకు వస్తాయని చెప్తున్నారు.

భోజనం చేసే పళ్ళెం కదలటం, తిన్నాక వేళ్ళు నాకటం చేస్తే డబ్బులు రాకుండా పోతాయి
చాలా ఉంది భోజనం చేసే పళ్లెం అటు ఇటూ కదులుతూ ఉంటుంది. ఇక అటువంటి ప్లేట్ లలో భోజనం చేయడం కూడా మంచిది కాదని, అలాంటి పళ్ళెం వాడుతున్న వారి ఇంటికి లక్ష్మీ దేవి రాదని చెబుతున్నారు. తర్వాత భోజనం చేసిన తర్వాత కొందరు వేళ్ళను నాకుతూ ఉంటారని, వేళ్లను నాటడం మంచిది కాదని అలా చేస్తే వారికి లక్ష్మీ కటాక్షం కలగదని చెబుతున్నారు. ఇక తిన్న పళ్ళెంలో చెయ్యి కడగటం కూడా దరిద్రం అని చెప్తున్నారు. అలా కూడా చెయ్యకూడదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications