vastu tips: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే సంపద వృద్ధి.. ఏ పని చేసినా విజయమే!!
అనేక ప్రతికూలమైన ఫలితాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు ఇంట్లో ఒక మొక్కను పెంచుకుంటే సానుకూల ఫలితాలు వస్తాయని, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఆ మొక్క తో ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ వాస్తుశాస్త్ర నిపుణులు ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన మొక్క అని చెబుతున్న మొక్క ఏంటి? ఆ మొక్క ప్రత్యేకత ఏంటి? సదరు మొక్క ఇంట్లో ఉండటం వల్ల కలిగే సానుకూల ఫలితాలు ఏంటి? వంటి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అపరాజిత మొక్కలను ఇంట్లో ఈ దిశలోనే పెట్టాలి
వాస్తు శాస్త్ర నిపుణులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్కగా అపరాజిత మొక్కలను చెబుతున్నారు. అయితే అపరాజిత మొక్కను ఇంట్లో పెట్టటం కోసం వాస్తు నియమాలు పాటించాలని అంటున్నారు. ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఈ మొక్కను ఉత్తరం దిశలో పెడితే మంచి ఫలితాలు వస్తాయి. కానీ పొరబాటున కూడా ఈ మొక్కను పశ్చిమ లేదా దక్షిణం దిశలో నాటకూడదు.

శంఖు పూల మొక్కలతో సంపద
అపరాజిత మొక్క అంటే శంఖు పూల మొక్క. ఈ శంఖు పూల మొక్కలు రెండు రంగుల్లో ఉంటాయి. తెలుపు మరియు నీలం రంగులో శంఖు పూలమొక్కలు ఉంటాయి. నీలం రంగులో ఉండే శంఖు పూల మొక్కలను కృష్ణ కాంత లేదా విష్ణు కాంత మొక్కలు అని కూడా అంటారు. అపరాజిత మొక్కలు ఇంట్లో పెరిగితే సంపద అలాగే వృద్ధి చెందుతుందని చాలా మంది బలంగా నమ్ముతారు.

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆదాయానికి లోటు ఉండదు
ఇంట్లో అపరాజిత మొక్కలు పెరిగితే ఎన్నో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్కలు లక్ష్మీ దేవికి బాగా ఇష్టం అయిన మొక్కలు కావటంతో ఆదాయానికి లోటు ఉండదని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో నీలిరంగు అపరాజిత మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల మేధస్సు, తెలివితేటలు పెరుగుతాయని నమ్మకం.

తెలుపు రంగు శంఖు పూల మొక్కతో లక్ష్మీ కటాక్షం
అలాగే తెలుపు రంగు శంఖు పూల మొక్కలతో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని తెలుస్తుంది. ఈ పువ్వులను విష్ణు భగవానుడికి సమర్పిస్తే అన్నిటా జయాలే కలుగుతాయని అంటారు. అలాగే అపరాజిత మొక్కల పూలను శని దేవుడికి సమర్పించటం వల్ల శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది. అపరాజిత మొక్కలను ఇంట్లో పెట్టటం వల్ల ఇంట్లో శాంతి, ఆనందం బాగా ఉంటుంది. ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే శంఖు పూల మొక్కను ఇంట్లో పెంచుకుంటే కలిగే సత్ఫలితాలను గుర్తించి శంఖు పూల మొక్కను ఇంట్లో పెట్టండి.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications