వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: పెంపుడు జంతువులకు వాస్తు; ఇంట్లో కుక్కలు ఆ దిశలో ఉంటే అనారోగ్యం!!

|
Google Oneindia TeluguNews

మానవులకు పెంపుడు జంతువులతో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, పెంపుడు జంతువుల వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పెంపుడు జంతువులు రక్తపోటును తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ ఆక్సిటోసిన్ స్థాయిలను పెంచుతాయి. కొన్ని రకాల నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఇక ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడానికి కూడా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు, విధానాలు ఉన్నాయి.

పెంపుడు జంతువులకు వాస్తు నియమాలు

పెంపుడు జంతువులకు వాస్తు నియమాలు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉండే ప్రేమ పక్షులు, అలాగే కుక్కలు వంటి జంతువులు నెగిటివ్ ఎనర్జీ లను ఇంట్లోకి రాకుండా నియంత్రించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మీరు మీ ఇంటిలో ఆహ్లాదకరమైన మరియు అనుకూల వాతావరణాన్ని సృష్టించేటప్పుడు మీ పెంపుడు జంతువులను సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే, మీరు అనుసరించాల్సిన కొన్ని కీలకమైన వాస్తు నియమాలు ఉన్నాయి. ఇంతకీ ఏ ఏం జంతువులను, పక్షులను పెంచుకోవచ్చు. అలాగే వాటిని ఎలా ఉంచాలి అనే అంశాలు కూడా తెలుసుకోవాలి.

పెంపుడు జంతువులతో ఇళ్ళలో విభిన్న ప్రభావాలు

పెంపుడు జంతువులతో ఇళ్ళలో విభిన్న ప్రభావాలు

ఇళ్ళలో మనం పెంచుకునే పెంపుడు జంతువులు, పక్షులు, జలచరాల విషయానికి వస్తే కుక్కలు, ప్రేమపక్షులు, తాబేళ్లు, ఆవులు, చేపలు తదితరాలను పెంచటం వాస్తు ప్రకారం మేలు చేకూరుస్తుందని చెప్పబడింది. అయితే పెంపుడు జంతువుల వాస్తు ప్రకారం, జంతువులు వాటి రకాన్ని బట్టి ఇంటిపై మరియు దాని యజమానులపై విభిన్న ప్రభావాలను కలిగి ఉంటాయి.

ఏ పెంపుడు జంతువును ఇంట్లో ఉంచాలి? పెంపుడు జంతువును ఏ దిశలో ఉంచాలి? అనే అంశాలు తెలుసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా కుక్కల విషయానికి వస్తే వాటి పెంపకంలో, వాటిని వుంచే దిశలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతోంది వాస్తు శాస్త్రం.

కుక్కను ఇంట్లో ఎక్కడ ఉంచాలంటే..

కుక్కను ఇంట్లో ఎక్కడ ఉంచాలంటే..

చాలామంది ఇళ్లల్లో కుక్కలను పెంచుతుంటారు. కుక్కలు మనిషితో స్నేహపూర్వకంగా మెదులుతాయి. కుక్కలు ఇంట్లో పెంపుడు జంతువులుగా రక్షణకు చిహ్నంగా పనిచేస్తాయి. వాస్తు శాస్త్ర మార్గదర్శకాలను అనుసరించి, కుక్కను ఉత్తరం వైపున ఉండే ఒక మూసివున్న ప్రదేశంలో ఉంచాలి. మీరు ఇల్లు కలిగి ఉంటే మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద మీ కుక్కల కెన్నెల్ తప్పనిసరిగా ఉంచాలి. అలాగే, కుక్కలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. అవి అపరిశుభ్రంగా ఉంటే వాటిని మీ ఇంట్లోకి రానివ్వకూడదు.

కుక్కను ఉంచకూడని దిశలు ఇవే..

కుక్కను ఉంచకూడని దిశలు ఇవే..

అంతేకాదు మీ కుక్క కెన్నెల్‌ను ఆగ్నేయ మరియు నైరుతి దిశలలో ఉంచడం మానుకోండి. ఈ దిశలు అనుకూలమైనవి కావు . ఆ దిశలో ఉంటే పెంపుడు జంతువులు ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతాయి. అలాగే అవి విచిత్రంగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఉంటాయి. కుక్కలను ఆగ్నేయం మరియు నైరుతి దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఉండే యజమానులకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ కుక్కలను ఉత్తరం వైపున ఉండే ఒక మూసి ఉన్న ప్రదేశంలోనే ఉంచాలి. కుక్కలు ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లో ఉన్నవారు కూడా ఆరోగ్యవంతులుగా జీవిస్తారు.

English summary
Vastu Shastra says that pets have Vastu. Architecture says that dogs in the house can get sick if they are in the southeast and southwest. Tells the dogs to position themselves in a northerly direction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X