వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: అపరాజిత పుష్పాలతో సంపద, శ్రేయస్సు.. ఇంకా బోలెడు లాభాలు

|
Google Oneindia TeluguNews

హిందూమతంలో పూలకు, చెట్లకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని పూలు విశేషమైన గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి. అటువంటి పూలలో అపరాజిత పుష్పాలు ఒకటి. ఈ అపరాజిత పుష్పాలనే శంఖు పుష్పాలు అని కూడా పిలుస్తారు. గొప్ప ఆయుర్వేద లక్షణా లు కూడా అపరాజిత పుష్పాలకు ఉన్నాయి.

ఉద్యానవనాలు, గృహాల అందాన్ని పెంచేందుకు నాటిన అపరాజిత మొక్కను ఆయుర్వేదంలో విష్ణుక్రాంత, గోకర్ణి మొదలైన పేర్లతో పిలుస్తారు. నెమలి ఈకల మాదిరిగా, శంఖు మాదిరిగా అందమైన షేప్ లో, ఈ అపరాజిత పుష్పాలు ఉంటాయి. అపరాజిత పుష్పాలు విష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు. ఈ పుష్పాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం.

aparajitaflowers-

ఈ పుష్పాలు రెండు రంగులలో ఉంటాయి. తెలుపు రంగు, నీలం రంగు . తెలుపు రంగు అపరాజిత పుష్పాలు విష్ణు పూజకు వినియోగిస్తే, నీలం రంగు అపరాజిత పుష్పాలు శివునికి సమర్పిస్తారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడంలో కూడా నీలం రంగు అపరాజిత పుష్పాలను నివేదిస్తారు. హిందూధర్మం లోనే కాకుండా జ్యోతిష్యంలో కూడా అపరాజిత పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అపరాజిత పుష్పం సంపద మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది. బాగా డబ్బులు సంపాదించాలన్నా, ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి సాధించాలన్నా అపరాజిత మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే ఎక్కడపడితే అక్కడ దానిని పెంచకూడదు.

కచ్చితంగా వాస్తు నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకునేవారు ఉత్తరం దిశలో పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో నీలిరంగు అపరాజిత మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అపరాజిత పూలతో శని దేవుడికి పూజ చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే అపరాజిత మొక్కలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
Vastu Shastra experts say that there will be wealth, prosperity and many more benefits with aparajita flowers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X