వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయక చవిత: ఏం చేయాలి, ఏం చేయకూడదు?

By Pratap
|
Google Oneindia TeluguNews

17 సెప్టెంబర్‌ 2015 వినాయకచవితి.

సాయంత్రం 6.20దాటితే పూజచేయాకూడదు

ప్రతీసంవత్సరానికిమల్లే ఈయేడాదీ వినాయకుడు భక్తజనులాని ఆశీర్వఆదించడానికి వచ్చేసాడు, ఐతే సంవత్సరం భాద్రపద శుద్ధచవితి 17గురువారం నాడు రెండు తిథులతో కూడుకుంది, చవితినుండి చతుర్దశి వరకూ ఉండే పదిరోజులలో 9రాత్రులు పది ఉదయాలు ఉంటాయి అందుకే చవితికి పదిరోజులుకలిపి వినాయకచతుర్దశిగా ముగిస్తారు.

Vinayaka Chavithi: What to do, what not?

నియమాలు(గమనిక)

చవితిముగియకుండా వినాయకమండపాలుకానీ,ఇంట్లోపూజలుకానీ చేయాలి. ఆ లెక్కన ఈ17.గురువారం సూర్యోదయానికి చవితి ఉండి, సాయంత్రానికి 6.22 కల్లా పంచమివస్తుంది కాబట్టి, సాయంత్రం 6.22 దాటితే 2వరోజుకిందికివస్తుంది.కాబట్టి ప్రత్యేకించి మండపాలవాళ్లు 6.20లోపు స్థాపించాలి,
ఒకవేళ అదిదాటితే రెండవరోజు స్థాపించిన లెక్కకిందికి వస్తుంది.

బయట మండపాలలో పూజలుచేసేవాళ్లు మొదటిరోజుచేయాల్సిన పూజలు

1.ప్రారంభగణపతిపూజ (విఘ్నబాధలు రాకుండా)
2.అఖండదీపారాధన (పదిరోజులూ వెలిగేదీపం - ఇది పెట్టల్సిన నియమంలేదు)
3.పుణ్యాహవాచనం
(మండపంపెట్టే చోట అనిరకాల మాలిన్యాలు,ముట్టువంటిదోషాలు పోవడానికి చేసే శుద్ధి పూజ)
4.నవగ్రపూజ,దిక్పాలకపూజ,మూషికపూజ
(వస్త్రంపైధాన్యపరచి చేచే ఆవాహన మండపపూజ,దీన్ని సత్యనారాయణవ్రతంలోకూడాచేస్తారు)
5.మూర్తిపూజ,కలశపూజ
(మూర్తిలో,కలశంలో వినాయకున్నిఆవాహనచేసే పూజావిధానం,విగ్రహానికి తప్పక ఆచ్ఛాదన,వస్త్రం,పంచ కట్టాలి)
6.కూష్మాండబలి (గుమ్మడికాయ తిప్పికొట్టడం దేవునికి దిష్టితీయడంవంటిది)

Vinayaka Chavithi: What to do, what not?

బయటమండపాలలో పూజలుచేసేవాళ్లు చివరిరోజుచేయాల్సిన పూజలు

1.మొదటిరోజునచేసినదేవతలకి విడివిడిగా నైవేద్యాలు పెట్టాలి
2.పసుపు అన్నంతో విగ్రహానికి 8దిక్కులా కర్పూరం వెలిగించిన బలిపెట్టాలి
3.గుమ్మడికాయకొట్టి విగ్రహం కదిలించాలి
4.కలశంలోని నీళ్లు విగ్రహం పైనచల్లాలి(ఇదేఅసలునిమజ్జనం)
5.వాహనంపై ఎక్కించాక (గుమ్మడికాయ కర్పూరంతో వెలిగించి వాహనంచుట్టూతిప్పికొట్టాలి)
6.నిమ్మకాయలమీదుగా వాహనం నడపాలి(ఇలాచేస్తే అశుభాలుజరగవు)

Vinayaka Chavithi: What to do, what not?

బయటమండపాలలో పూజలుచేసేవాళ్లు చేయకూడనివి

1.మద్యమాంసాలకు దూరంగా ఉండాలి, అప శబ్దాలు పలకకూడదు
2.అలంకారాలకి ఖర్చుపెట్టేదానికన్నా ,చివరిరోజు డప్పులికి ఖర్చుపెట్టేదానికన్నా అన్నదానాలకి, కుంకుమ 3.పూజలవంటివి ఉచితంగా స్వంతఖర్చులతో చేయిస్తే ఎక్కువపుణ్యం వస్తుంది
4.స్పీకర్‌లుకాకుండా శాస్త్రీయమైనభజనలు రాత్రిపూట కొద్దిసేపుచేయడం మంచిది
5. ఏరకంగా ఇతరులను ఇబ్బందిపెట్టినా పుణ్యంకన్నా ఎక్కువపాపం తగులుతుంది.

- మారుతి శర్మ

ఓేూీ

దేవుని సొమ్ము దుర్వినియోగం చేసేవారు, ఆహారాది నియమాలు చేయలేనివారు పూజలకు దూరంగా ఉండండి.

English summary
Astrologer Maruthi Sharma explains what to do what not during Vinayaka Chavithi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X