వినాయకచవితి 2023: గణేశ నవరాత్రులు జరుపుకోవటం వెనుక విశేషాలివే!!
భారతదేశ ప్రజలు గణేశ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి రెడీ అయ్యారు. పవిత్రమైన గణేశ నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. గణేశ నవరాత్రి ఉత్సవాలను ముఖ్యంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. హిందువులు అందరూ సమిష్టిగా ఒక చోట చేరి గణేశ నవరాత్రి వేడుకలు జరుపుకుంటారు.
గణేశ నవరాత్రి ఉత్సవాలను అసలు ఎందుకు జరుపుకుంటారు? గణేష్ నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాశస్త్యం ఏమిటి? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వినాయక చవితి పండుగ మొదటి రోజున ప్రజలు తమ ఇళ్లల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి గణనాథుడికి స్వాగతం పలుకుతారు. వినాయకుడిని పువ్వులతో అలంకరించి, తొమ్మిది రకాలైన పత్రితో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అలా తొమ్మిది రోజులపాటు వినాయకుడికి పూజలు చేసి నిమజ్జనం చేసి వినాయకుడిని సాగనంపుతారు.

ఇళ్ళలో వినాయకుడి విగ్రహాలను పెట్టుకుని పూజించేవారు ఎన్ని రోజులు పూజలు నిర్వహించాలి అనేది పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంటుంది, ఇక వాడవాడలా గణేష్ మండపాలను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు అత్యంత ఘనంగా వినాయక నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు చెయ్యటం వెనుక ఒక పెద్ద కథనే ఉంది.
వినాయక చవితి పండుగను జరుపుకోవడం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వినాయకచవితి పండుగ దేశభక్తికి, ఐక్యతకు ప్రతీకగా చెబుతారు. ప్రజలను ఏకం చేయడానికి వారి మధ్య ఉన్న కులతత్వ అంతరాలను తగ్గించడానికి బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను ప్రారంభించారని చెబుతారు.
చత్రపతి శివాజీ మహారాజ్ కాలం నాటికి ఈ పండుగను ఘనంగా జరుపుకునే వారని, ప్రజలలో జాతీయవాద స్ఫూర్తిని పెంపొందించడం కోసం గణేశ నవరాత్రి వేడుకలను నిర్వహించేవారని చెపుతారు.బహిరంగ ప్రదేశంలో పెద్ద మట్టి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించిన మొదటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అని చెప్తారు. గణేశ నవరాత్రి వేడుకలు చిన్నా, పెద్దా , పేద , ధనిక తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకుంటారని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications