అక్టోబర్ శుక్రుడు వక్రగతితో విపరీత రాజయోగం..ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక సముచితమైన స్థానం ఉంటుంది, శుక్రుడు సంపదలను, విలాసాలకు అధిపతి. అటువంటి శుక్రుడు అక్టోబర్ 6, 2026 నుంచి శుక్రుడు తులా రాశిలో వక్రగతి ప్రారంభించనున్నాడు. శుక్రుడి వక్రగతి నవంబర్ వరకు కొనసాగుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది విపరీత రాజయోగాన్ని కలిగిస్తుంది. అనూహ్య లాభాలు, ధనాగమం కలిగించే యోగం ఇది.
సింహ రాశి
విపరీత రాజయోగం కారణంగా సింహరాశి జాతకులకు అక్టోబర్ మాసంలో అనూహ్యంగా డబ్బు వస్తుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది కానీ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి
శుక్రుడి కారణంగా ఏర్పడే విపరీత రాజయోగం కారణంగా మీనరాశి జాతకులకు గతంలో పోయిన డబ్బు తిరిగి రావచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి మంచి కాలం. విదేశీ బదిలీ అవకాశాలు కూడా ఉండవచ్చు. ఇది మీనరాశి జాతకులకు కలిసి వచ్చే కాలం.
మకర రాశి
మకర రాశి జాతకులకు శుక్రుడి వల్ల ఏర్పడే విపరీత రాజయోగం కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది, జీతం పెరుగుదల కనిపిస్తుంది. కోర్టు కేసులు ఉంటే అనుకూలంగా తీర్పులు రావచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక ఆందోళనలు తగ్గుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు అక్టోబర్ మాసంలో విపరీత రాజయోగం శుభాలను చేకూరుస్తుంది. ధైర్యం పెరుగుతుంది. సమాజంలో మంచి స్థానం వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం కలుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ప్రగతి సాధిస్తారు. విదేశాల్లో పనిచేసేవారికి కూడా లాభం వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి విపరీత రాజయోగం కారణంగా వివాహితులకు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది . అప్పులు తగ్గి ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ కాలంలో ఈ ఐదు రాశులవారికి మొత్తంగా ధనలాభం, అభివృద్ధి కనిపిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
