weekly horoscope: ఈవారం ఈ రాశులవారికి జాక్ పాట్.. తగ్గేదేలే!
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఫిబ్రవరి మూడో వారం ఐదు రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అదే సమయంలో, చంద్రుడు, కుజుడు సంయోగం ధనయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ శక్తివంతమైన యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మిధునరాశి
మిథున రాశి వారికి ఈ వారం ధన, బుధాదిత్య రాజ యోగాల కలయికతో శుభఫలితాలు వస్తున్నాయి. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మిధునరాశి వారు చేసే ప్రయాణాలు కలిసివస్తున్నాయి. పెట్టుబడుల నుంచి శుభవార్తలు వస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలత కనిపిస్తుంది. ప్రారంభంలోనే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తమ శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో శుభవార్తలు వినిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావాల్సిన బకాయిలు తిరిగి వసూలవుతాయి. వ్యాపారులు గణనీయమైన లాభాలు సంపాదిస్తారు.
తులా రాశి
తులారాశి జాతకులకు ఈ వారం అరుదైన శుభ యోగాల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు వస్తాయి. కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో అన్ని పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం బహుళ రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చేసిన కృషికి తగిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వారంలో రెండో భాగంలో మీకు రావాల్సిన బకాయిలు తిరిగి అందుతాయి. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు రాబోయే వారం శుభ ఫలితాలను తెస్తుంది. ఆర్థికంగా గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వారంలో రెండో భాగంలో ధనుస్సు రాశి వారు చాలా బిజీగా గడుపుతారు. వ్యాపారులకు కృషికి తగ్గ ఫలితాలు లభిస్తాయి. స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications