• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంగువ దివ్యౌషధం : ఈ సుగంధ ద్రవ్యంలో ఎలాంటి ఔషధ గుణాలున్నాయి..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు. దీనిని సంస్కృతంలో "హింగు" అంటారు. ఇంగువ భారతదేశంలో హింగ్ అని పిలువబడుతుంది, ఇది ప్రధానంగా మధ్యధరా ప్రాంతాలలో తూర్పు మరియు మధ్య ఆసియాలో కనిపిస్తుంది. ఇంగువ దాని ఔషధ లక్షణాలకి, ముఖ్యంగా జీర్ణక్రియలో సహాయపడటానికి చాలా విలువైనది.

ఇంగువ (Asafoetida) వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం, చాలా ఔషధ గుణాలున్న మొక్క. 'అస' అంటే పర్షియన్ లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్ధం. దీనిని ఇండో - ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని పిలుస్తారు. పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. ఇంగువ మొక్కలు గుబురుగా పొదలాగా ఉంటాయి. వీని కాండం సన్నగా బోలుగా ఉంటుంది. ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడు నెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది. ఇది పసుపు రంగులో ఉండి బాగా తీవ్రమైన వాసనతో ఉంటుంది.

What are the health benefits of Asafoetida?

భారతదేశ వంటల్లో ముఖ్యంగా తెలుగువారి వంటింట్లో దీని స్థానం చెప్పుకోదగినది. మనం ఎన్నో వంటల్లో ఇంగువని ఉపయోగిస్తూ ఉంటాము. వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలాదినుసుల వాసననిస్తుంది. ముఖ్యంగా పులిహోర వంటి వాటిలో ఇంగువ లేకపోతే రుచి ఉండదు. ఇంగువ వల్ల కేవలం రుచి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

ఔషధ గుణాలు కలిగినది, ఇందులో గల పదార్థాలు:- ఇంగువలో కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరటిన్, బి - విటమిన్.

ఉపయోగాలు :-

* కడుపుని శుభ్రం చేసే సాధనాలలో ఇది చాలా ముఖ్యమైనది.

* ప్రేవుల్లో వచ్చే నొప్పిని కూడా అది తగ్గిస్తుంది. నరాల బలానికి దీనిని వాడుతారు. మంచి జీర్ణకారి.

* నిద్రని పుట్టించే గుణం కూడా దీనిలో ఉంది దీనిని బ్రాంకయిటస్, అస్త్మాలలో వాడుకోవచ్చు.

* రెండు చెంచాల తేనెను 2 , 3 సెంటి గ్రాముల ఇంగువ పొడిని, తెల్ల ఉల్లి రసం, తమలపాకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశవ్యాధులు దూరంగా ఉంటాయి.

* హిస్టీరియాతో బాధపడే వారికి ఇంగువ వాసనని చూపిస్తే ఫలితం బాగుంటుంది.

* లైంగిక పటుత్వం తగ్గినవారిలో ఇంగువని వాడుకోవచ్చు. మర్రిపాలలో తేనెని కలిపి కొద్ది ఇంగువని కలిపి తీసుకుంటే 40 రోజులలో మంచి గుణం కనిపిస్తుంది.

* ఐరోపా దేశాల్లో చిన్న పిల్లల మెడలో దీనిని తాయెత్తులా కడితే చాలా రోగాలు దూరంగా ఉంటాయని వారు నమ్ముతారు. బహుసా దీనికి ఉందే తీవ్రమైన వాసన వలన చాలా సూక్ష్మ జీవులు దరిచేరవు.

* స్త్రీల సమస్యలకి కూడా ఇంగువని మంచి మందుగా వాడుకోవచ్చు. ముఖంగా పీరియడ్స్ లో వచ్చే నొప్పి, అధిక రక్తస్రావం, లుకేరియా, తరచూ ఎబార్షన్స్ కావడం లాంటి అనేక పరిస్థితులలో దీనిని వాడతారు. పై సమస్యలతో సతమతమయ్యేవారు నెలరోజుల పాటు రోజూ మూడు సార్లు ఇంగువని తేనెని మేకపాలతో కలిపి తీసుకుంటే చాల ఉపయుక్తంగా ఉంటుంది ఇలా చేయడం వలన స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పై ఇంగువ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ప్రసవానంతరం వచ్చే జీర్ణ వ్యవస్థకి వచ్చే అనేక సమస్యల్లో కూడా ఇంగువ ఉపకరిస్తుంది.

* పంటి నొప్పి బాధిస్తుంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి ఒక దూదిలో ఉంచి పుప్పి పంటిలో ఉంచితే నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

* ఇంగువని నల్లమందుకు విరుగుడుగా కూడా వాడతారు. నల్లమందు యొక్క చెడుగుణాల్ని ఇది తగ్గిస్తుంది.

* తేనె అల్లం కలిపి దానిలో కొద్దిగా ఇంగువను వేసి తీసుకోవడం వల్ల పొడి దగ్గు , శ్వాస నాళము లో వాపు , ఉబ్బసం వంటివి తగ్గిపోతాయి.

* ఇంగువను డయాబెటిస్ వైద్యంలో కూడా వాడతారు దీనిలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం ఉంది. మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయ పడుతుంది.

* అధిక రక్తపోటు బాధపడే వాళ్లకి కూడా ఇంగువ దివ్యౌషధంలా పని చేస్తుంది ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయ పడుతుంది.

* మైగ్రేన్ తలనొప్పి ఉంటే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే తగ్గుతుంది.

* ఒత్తిడి తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది .

* జామ చెట్టు బాగా కాయలు కాయటానికి ఇంగువ పొడుము చేసి పాదులో వేస్తారు.

English summary
The scientific name of the asparagus plant is 'Ferula asafotida'. It is widely grown in Iran and Afghanistan. They are currently grown in the states of Punjab and Kashmir in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X