కోరికలను నందీశ్వరుడి చెవిలో చెబుతున్నారా..? అయితే మీరు తప్పు చేస్తున్నట్టే..!
శిలాదుడు అనే ముని శివుడిని గురించి తీవ్ర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, శిలాదుడు తన కుమారుడిగా జన్మించాలని కోరాడు. శివుడు ఆ కోరికను తీర్చాడు. ఆ కుమారుడే నందీశ్వరుడు.నందీశ్వరుడు శివునికి వాహనంగా,యు పరమ భక్తుడిగా పరిగణించబడతాడు. శివుని గుడిలో నంది విగ్రహం శివునికి ఎదురుగా ఉంటుంది. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన సేవకుడిగా గుర్తింపు పొందాడు.నందీశ్వరుడు శివునితో సమానంగా పూజలందుకుంటాడు. శివాలయాలలో నందీశ్వరుని విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది.నందీశ్వరుడు చిన్నతనంలోనే శివుని పట్ల గొప్ప భక్తిని కనబరిచాడు.శివుడు అతని భక్తికి మెచ్చి తన వాహనంగా స్వీకరించాడు.
నందీశ్వరుడు శివునితో పాటుగా పూజలందుకుంటాడు. శివాలయానికి వెళ్లిన భక్తులు ముందుగా నందీశ్వరుని దర్శించుకుంటారు. నందీశ్వరుని చెవిలో తమ కోరికలను చెప్పుకుంటే అవి నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నంది ఎల్లప్పుడూ శివుని దగ్గర ఉంటాడు. భక్తులు తమ కోరికలను నందికి చెబితే, నంది వాటిని శివునికి చేరవేస్తాడని నమ్ముతారు.నంది శివుని యొక్క నమ్మకమైన సేవకుడు. అందుకే నందికి చెప్పిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.నంది చెవిలో కోరికలు చెప్పడం ద్వారా భక్తులు తమ భక్తిని వ్యక్తపరుస్తారు.

అయితే నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పే సమయంలో కొన్ని నియమాల్ని పాటించాలని వేద పండితులు చెబుతున్నారు.నందీశ్వరుడికి కుడివైపున కూర్చుని.. ఆయన రెండు కొమ్ముల మీద.. బొటన వేలు, చూపుడు వేలు ఉంచి, ఎడమ చేయ్యి తోక మీద పెట్టి బొటన వేలు,చూపుడు వేలు మధ్యలో నుంచి శివుడిని చూడాలి.ఆ తర్వాత నందీశ్వరుడి కుడి చేవిలో ఓం అని ఐదుసార్లు చెప్పుకున్న తర్వాత.. మన కోరికలను నందీశ్వరుడికి చెబితే.. ఆయన దాన్ని ఆ పరమ శివుడికి చేరవేస్తాడు.ఈ విధానంగా చేస్తే కచ్చితంగా ఆ శివుడి ఆశీస్సులు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications