త్వరలో కుంభరాశిలో శని అస్తమయంతో వీరికి కష్టాల పర్వమే!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మలకు అధిపతి అయిన శని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని దేవుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచారం చేస్తాడు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో శని దేవుడు అనేక స్థితులకు లోనవుతాడు. అయితే ఫిబ్రవరి 27వ తేదీన శని కుంభరాశిలో అస్తమిస్తున్నాడు.

కుంభరాశిలో శని అస్తమయం
కుంభ రాశిలో శని అస్తమయం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూడబోతున్నారు. కుంభరాశిలో శని అస్తమయం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే, బాగా ఇబ్బందులు పడే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

With Saturn setting down in Aquarius soon it will be a difficult time for them

మిధున రాశి
మిధునరాశి వారికి తొమ్మిదవ గృహంలో శని అస్తమిస్తాడు. కాబట్టి మిధునరాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. శని అస్తమయం నుండి మిధున రాశి వారు పనిలో తీవ్రమైన అడ్డంకులను, వైఫల్యాలను ఎదుర్కొంటారు. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు నడుపుతున్నప్పుడు మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.

సింహరాశి
సింహరాశిలో ఏడవ గృహంలో శని అస్తమయం అవుతున్నాడు. దీని కారణంగా సింహరాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాలి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఫీసులో పనిచేసే వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నతాధికారులతోనూ, సహ ఉద్యోగులతో విభేదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
తులారాశిలో ఐదవ గృహంలో శని అస్తమయం జరుగుతుంది. దీనివల్ల తులారాశి వారు తమ పిల్లల ఆరోగ్యం గురించి చదువు గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సి వస్తుంది. ఈ సమయంలో అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వివిధ సమస్యల కారణంగా పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. విద్యార్థులు తమ చదువులలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమలో ఉన్న వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+