నవరాత్రుల్లో శుభయోగాలతో ఈ రాశులవారు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు!
రేపటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాలలో భక్తులు పూజిస్తారు. నవరాత్రులలో దుర్గాదేవి కటాక్షంతో, అలాగే నవరాత్రుల సమయంలో వివిధ గ్రహాల సంచారం కారణంగా ఏర్పడుతున్న బ్రహ్మ యోగం, శుక్ల యోగం, మహాలక్ష్మి రాజయోగం వంటి పలు శుభ యోగాలతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
నవరాత్రులలో అదృష్ట రాశులు
నవరాత్రులలో దుర్గా దేవి అనుగ్రహంతో కొన్ని రాశులవారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు నూతన ఆదాయ మార్గాలను చూస్తారు. నవరాత్రులలో దుర్గమ్మ అనుగ్రహాన్ని పొంది విశేషమైన సంపదలను పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సింహరాశి
సింహరాశి జాతకులకు దుర్గమ్మ అనుగ్రహం నవరాత్రుల సమయంలో పుష్కలంగా ఉంటుంది. నవరాత్రుల సమయంలో ఏర్పడే విశేష యోగాలు వీరికి అదృష్టాన్ని విజయాన్ని తీసుకువస్తాయి. ఈ సమయంలో ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సింహ రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి నవరాత్రులలో దుర్గమ్మ కటాక్షం ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో సంపాదనకు నూతన ఆదాయ మార్గాలను చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలలో లాభాలను పొందుతారు.
మేషరాశి
మేష రాశి జాతకులకు ఈ సంవత్సరం నవరాత్రులు శుభాలను చేకూరుస్తున్నాయి. ఈ సమయంలో మేషరాశి వారి ఆత్మవిశ్వాసం, శక్తి పెరుగుతాయి. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి .కెరీర్ లోనూ, వ్యాపారాలలోనూ కొత్త అవకాశాలు వస్తాయి. ఇది మేష రాశి వారికి అన్ని విధాలా కలిసొస్తుంది. దుర్గాదేవి ఆశీస్సులతో, కుటుంబంలో శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయి. మేషరాశి జాతకులు అన్ని విధాలా లబ్ధిని పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications